వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్దవ్‌కు ఊరట.. శివాజీ పార్క్‌ వద్ద దసరా ర్యాలీకి కోర్టు అనుమతి

|
Google Oneindia TeluguNews

బాంబై హైకోర్టులో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరేకు ఊరట కలిగింది. దసరా సందర్భంగా అక్టోబరు 5వ తేదీన నిర్వహించే బహిరంగ సభకు అనుమతి ఇచ్చింది. సభ నిర్వహణకు అంతకుముందు బృహన్ ముంబై నగర పాలక సంస్థ అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్దవ్ థాకరే బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

బీఎంసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై జస్టిస్ ఆర్‌డీ ధనూకా, జస్టిస్ కమల్ ఖాటా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. బీఎంసీ ఆదేశాలు న్యాయ ప్రక్రియకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. అక్టోబరు 2 నుంచి 6 వరకు శివాజీ పార్కును వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని షరతు విధించింది.

shiva Sena gets permission to hold Dussehra rally

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో శివసేన వర్గం ఎమ్మెల్యే సదా సర్వంకర్ కూడా బహిరంగ సభ నిర్వహణకు అనుమతించాలని బీఎంసీకి దరఖాస్తు చేశారు. దీనిని కూడా బీఎంసీ సెప్టెంబరు 21వ తేదీన తిరస్కరించింది. ఇరు వర్గాలు దరఖాస్తు చేసినందు వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతాయని స్థానిక పోలీసులు హెచ్చరించారు. దీంతో అనుమతి ఇవ్వలేదు. అయితే దీనిపై థాకరే వర్గం కోర్టును ఆశ్రయించడంతో.. అనుమతి ఇచ్చింది.

థాకరే తిరుగుబాటు చేసి.. బీజేపీతో ఏక్‌నాథ్ షిండేతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. షిండే సేన- బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా షిండే, డిప్యూటీగా ఫడ్నవీస్ కొనసాగుతున్నారు.

English summary
Shiv Sena faction led by former Maharashtra CM Uddhav Thackeray had moved the Bombay High Court seeking permission to hold its annual Dussehra rally at Shivaji Park in central Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X