వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివాజీ, రాయన్న విగ్రహాలు ధ్వంసం, బెలగావిలో 144 సెక్షన్, జోక్యం చేసుకొండి: ఉద్దవ్ థాకరే

|
Google Oneindia TeluguNews

విగ్రహాల ధ్వంసంతో కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఐటీ హబ్ బెంగళూరులో శివాజీ మహారాజ్ విగ్రహాం ధ్వంసం చేశారనే వార్త గుప్పుమంది. దీంతో బెలగావి జిల్లాలో కొందరు ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి బీభత్సం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు సంగొళి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిని వదల్లేదు. ప్రభుత్వ వాహనాలపై రాళ్లు రువ్వారు. ఘటనను సీఎం బసవరాజు బొమ్మై ఖండించారు

 ఎవరినీ వదలొద్దు..

ఎవరినీ వదలొద్దు..

నిందితులను ఎవరినీ వదలొద్దు అని సీఎం స్పష్టంచేశారు. ఈ మేరకు హోం మంత్రి జ్ఞానేంద్రకు ఆదేశాలు జారీచేశారు. రెండు ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాళ్లతో దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వ వాహనాలపై దాడి చేయడం నేరం. ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని సీఎం బొమ్మై స్పష్టంచేశారు.

144 సెక్షన్ విధింపు

144 సెక్షన్ విధింపు


సంగొలి రాయన్న సేన శివరాజ్ హొలిమఠ్ అధ్యక్షుడు తిలక్ వాడీ పోలీసు స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ధ్వసం చేసిన తర్వాత ఇప్పటివరకు తిరిగి ప్రతిష్టంచలేదు అని అందులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఘటన జరిగిందని.. ఆ తర్వాత నిందితులు పారిపోయారని ఆయన చెప్పారు. తర్వాత విగ్రహాన్ని పోలీసు స్టేషన్ తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తర్వాత పరిస్థితి చేయ దాటకుండా ఉండేందుకు 144 సెక్షన్ విధించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పస్టంచేశారు. బెళగావిలో గల సిటీ, తాలుకలో ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొన్నారు.

చర్యలు తీసుకొండి: ఉద్దవ్ థాకరే

చర్యలు తీసుకొండి: ఉద్దవ్ థాకరే

ఘటనను మాజీ కర్ణాటక ముఖ్యమంత్రులు బీఎస్ యడియూరప్ప, సిద్దరామయ్య, హెచ్ డీ కుమారస్వామి ఖండించారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కూడా ఘటనను ఖండించారు. జిల్లాలో శాంతిని పునరుద్దరించే ప్రయత్నాలు చేయాలని ప్రజలను కోరారు. ఘటనపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే కూడా స్పందించారు. శివాజీ విగ్రహాం ఘటనకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు.

English summary
Karanata Chief Minister Basavaraj Bommai condemned the Shivaji, Rayanna statues vandalise incidents
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X