వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ అధికారంలోకి వచ్చాక నీ పని చెప్తా! కలెక్టర్‌కు మాజీ సీఎం వార్నింగ్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : మళ్లీ అధికారంలోకి వచ్చాక నీ పని చెప్తా! || Oneindia Telugu

చింద్వారా : ఒకవైపు తీరికలేని ఎన్నికల ప్రచారం మరోవైపు ఠాఠెత్తిస్తున్న ఎండలు వెరసి రాజకీయ నాయకులు సహనం కోల్పోయేలా చేస్తున్నాయి. ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చింద్వారాలో తన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించడంతో ఆయన కలెక్టర్‌ను బెదిరించడం వివాదాస్పదమైంది.

వారణాసిలో మోడీ వర్సెస్ అజయ్ రాయ్! ప్రియాంక పోటీపై వీడిన సస్పెన్స్!వారణాసిలో మోడీ వర్సెస్ అజయ్ రాయ్! ప్రియాంక పోటీపై వీడిన సస్పెన్స్!

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌహాన్ చింద్వారా జిల్లాలోని ఉమ్రేత్‌కు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం ఆయన సాయంత్రం 5.30గం.లకు హెలికాప్టర్‌లో వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అయితే జిల్లా అధికారులు మాత్రం సాయంత్రం 5గంటలలోపే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన మాజీ ముఖ్యమంత్రి కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తిరిగి అధికారంలోకి వస్తే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా అని బెదిరించారు.

Shivraj Chouhan Warns Chindwara collector

బెంగాల్‌లో మమత బెనర్జీలాగే మధ్యప్రదేశ్‌లో సీఎం కమల్‌నాథ్ తమ హెలికాప్టర్లు ల్యాండ్ కాకుండా అడ్డుకుంటున్నారని చౌహాన్ మండిపడ్డారు. తాను ప్రచారం నిర్వహించిన ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని వాపోయారు. సాయంత్రం ఆరింటి వరకు అనుమతి కోరినా కలెక్టర్ అంగీకరించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు. మూడుసార్లు మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాశంగా మారాయి.

English summary
Claiming that his helicopter was denied permission to land in Chhindwara's Umreth, former Madhya Pradesh chief minister Shivraj Singh Chouhan on Wednesday issued a warning to the city's collector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X