చౌహాన్ ప్రమాణం: మోడీతో బాబు రహస్య చర్చలు
భోపాల్: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చిన చంద్రబాబు, నరేంద్ర మోడీతో గంటకు పైగా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య జరిగిన రహస్య చర్చల్లో ఎన్నికల పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు బిజెపి అగ్రనేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్‌లతో విడివిడిగా చర్చలు జరిపారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించినప్పటి నుంచి బిజెపికి దగ్గరవుతూ వస్తున్నారు. ఢిల్లీలో నరేంద్ర మోడీతో కలిసి వేదికను కూడా పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ శివరాజ్ సింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేత ఎల్‌కె ఆద్వానీ, పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
వరుసగా మూడోసారి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పగ్గాలు చేపట్టారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బిజెపికి 168 సీట్లు వచ్చాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో కాంగ్రెసు బలం 71 నుంచి 58కి తగ్గిపోయింది.












Click it and Unblock the Notifications