ఒలింపిక్స్‌పై శోభా డే వివాదాస్పద వ్యాఖ్యలు, నెటిజన్ల ఆగ్రహం

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల పైన ప్రముఖ రచయిత్రి శోభాడే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెల్ఫీలు తీసుకోవడం, ఉత్త చేతులతో తిరిగి రావడం.. ఒలింపిక్స్‌లో భారత జట్టు లక్ష్యమిదే, అవకాశం, డబ్బు రెండూ వృథా అని ఆమె ట్వీట్ చేశారు.

ఆమె ట్వీట్ పైన పలువురు మండిపడ్డారు. క్రీడాకారులను నిరుత్సాహపరిచేలా మాట్లాడవద్దని ధ్వజమెత్తారు. నెటిజన్లు ఆమె పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. శోభా డే వ్యాఖ్యలు సరికాదని కొందరు క్రీడాకారులు కూడా అన్నారు.

Shobhaa De defends herself on insulting Indian athletes

తన పైన వచ్చిన విమర్శలకు శోభా డే స్పందించారు. తన ట్వీట్‌ను ఆమె సమర్థించుకున్నారు. తాను అన్న దాంట్లో తప్పేమీ లేదని, తన ట్వీట్‌కు క్షమాపణ చెప్పబోనని శోభ డే చెప్పారు.

తన ట్వీట్ అథ్లెట్లకు వ్యతిరేకం కాదని చెప్పారు. నేను మన ఆటగాళ్లకు మద్దతిస్తానని చెప్పారు. తాను ఆటగాళ్లకు సరైన సదుపాయాలు కల్పించని స్పోర్ట్ అథారిటీని అన్నానని చెప్పారు. రియో ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతా తెరవని విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+