శివసేనపై మరో వ్యాఖ్య: సానియాను లాగిన శోభా డే
ముంబై: కాలమిస్టు శోభా డేకు, శివసేన నేతలకు మధ్య ప్రారంభమైన వివాదం మరింత ముదురుతోంది. తాజాగా, శోభా డే వివాదంలోకి హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను లాగారు. ముస్లింల ఓటింగ్ హక్కును రద్దు చేయాలని శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనపై దాడికి శోభా డే సానియా మీర్జా చారిత్రక విజయాన్ని ప్రస్తావించారు.
టెన్నిస్ డబుల్స్‌లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారత మహిళగా సానియా మీర్జా చరిత్రకెక్కింది. డబ్ల్యుటిఎ ఫ్యామిలీ సర్కిల్ కప్‌ను సానియా మార్టినా హింగిస్‌తో కలిసి గెలుచుకుంది. సానియా మీర్జా విజయాన్ని ట్విట్టర్‌లో ప్రశంసిస్తూ ఆమె ఓటు వేయవచ్చునని శోభా డే అన ్నారు.
Sania Mirza: Global Superstar. India's pride. People's darling. Hope she can still vote ! pic.twitter.com/aTPYZ3kHkH
— Shobhaa De (@DeShobhaa) April 13, 2015 ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకోవడాన్ని నిరోధించడానికి ముస్లింల ఓటు హక్కును రద్దు చేయాలని రౌత్ శివసేన అధికారిక పత్రిక సామ్నాలో రాశారు.
మహారాష్ట్రలోని మల్టీఫ్లెక్స్‌ల్లో తప్పనిసరిగా మరాఠీ చిత్రాలను ప్రదర్శించాలనే ఆదేశాలపై శివసేనకు, శోభా డేకు మధ్య వివాదం ప్రారంభమైంది. మరాఠీ ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని ఆరోపిస్తూ శివసేన శోభాడేపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో శోభా డే నివాసం వద్ద ముంబై పోలీసులు భద్రతను పెంచారు. రౌత్ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి శోభా డే సానియా మీర్జా చిత్రాలను పోస్టు చేసి ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications