Shock: దెబ్బకు భార్యతో కలిసి దేశం వదిలి వచ్చేశాడు. రాత్రి భార్య, కూతుర్ని చంపేసి ఆత్మహత్య, రాత్రి ఇంట్లో!
చండీగఢ్/నేపాల్ : యువతి, యువకుడు వివాహం చేసుకుని సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఓ కూతురు ఉంది. కూతురు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. దంపతులకు వారి కుటుంబ సభ్యులు నచ్చ చెబుతూ వచ్చారు. అయితే దంపతుల మద్య రాజీ కుదరలేదు. చివరికి భర్త అతని భార్య, కుమార్తెను పిలుచుకుని ఆ దేశం వదిలి పొరుగు దేశానికి వెళ్లిపోయాడు.
బంధువులు అప్పటికే అద్దె ఇంటిని చూసి పెట్టడంతో అక్కడ దంపతులు కాపురం పెట్టారు. రాత్రి బంధువులతో మాట్లాడి ఇంటికి వెళ్లిన దంపతులు మరుసటి రోజు మద్యాహ్నం అయినా ఇంటి నుంచి బయటకురాలేదు. బంధువు వెళ్లి చూడగా బెడ్ మీద భార్య, కూతురు శవమైకనించారు. పక్కరూమ్ లో భర్త ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో బంధువు హడలిపోయాడు.

నేపాల్ దంపతులు
నేపాల్ లో రేషమ్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన పూజా అనే యువతిని రేషమ్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రేషమ్, పూజా దంపతులు మూడు సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. పూజా, రేషమ్ దంపతులకు మాన్సీ (2) అనే కూతురు ఉంది.

నేపాల్ వదిలేసి చండీగఢ్ వచ్చేసిన భర్త
కూతురు పుట్టిన తరువాత రేషమ్, పూజా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రేషమ్, పూజా దంపతులకు వారి కుటుంబ సభ్యులు నచ్చ చెబుతూ వచ్చారు. అయితే రేషమ్, పూజా దంపతుల మద్య రాజీ కుదరలేదు. చివరికి రేషమ్ అతని భార్య పూజా, కుమార్తెను పిలుచుకుని నేపాల్ వదిలి పొరుగు దేశం భారత్ లోని చండీగఢ్ కు వచ్చేశాడు.

అద్దెఇల్లు చూసి పెట్టిన బంధువు
చండీగఢ్ లోని కిషన్ గఢ్ లో రేషమ్ బంధువు గుర్ వేవ్ సింగ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు. రేషమ్, పూజా దంపతుల కోసం కొంతకాలం క్రితం కిషన్ గఢ్ లోని భగవాన్ పూర్ ఏరియాలో అద్దె ఇంటిని తీసుకున్న గుర్ దేవ్ సింగ్ వాళ్ల వచ్చిన తరువాత ఆ ఇంటిని వాళ్లకు అప్పగించారు మూడు రోజుల క్రితమే రేషమ్, పూజా దంపతులు కిషన్ గఢ్ లోని అద్దె ఇంటిలో కాపురం మొదలుపెట్టారు.

భార్య, కూతురిని చంపేసి భర్త ఆత్మహత్య
రాత్రి బంధువు గురుదేవ్ సింగ్ తో ఆయన ఇంటిలోనే మాట్లాడిన పూజా, రేషమ్ దంతులు కుమార్తెతో కలిసి వారు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. రాత్రి ఇంట్లో రేషమ్, పూజా దంపతుల మద్య ఏం జరిగిందో తెలీదు మరుసటి రోజు మద్యాహ్నం అయినా ఇంటి నుంచి రేషమ్, అతని భార్య పూజా బయటకురాలేదు. గుర్ దేవ్ సింగ్ కు అనుమానం వచ్చి రేషమ్ ఇంటికి వెళ్లి చూడగా బెడ్ మీద పూజా, ఆమె కూతురు మాన్సీ శవమైకనించడం. పక్కరూమ్ లో రేషమ్ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడంతో హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

రాత్రి ఏం జరిగింది ?
రేషమ్ అతని భార్య పూజా, కూతురు మాన్సీని గొంతు కోసి హత్య చేసి తరువాత అతను సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అన్నారు. అద్దె ఇల్లు తీసుకుని మూడు రోజుల ముందే కాపురం వచ్చిన ఒకే ఇంటిలోని ముగ్గురు శవమై కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications