వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏబీపీ సీఓటర్ సర్వే: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌దే అధికారం

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాదిలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్ట షాక్ తగలనున్నట్లు ఏబీపీ సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2019 ఎన్నికలకు ముందు జరగనున్న ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఓటమిని మూటగట్టుకోనున్నాయని సర్వే వెల్లడించింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు మోడీ స్వింగ్‌తో నెగ్గుకొస్తారని సర్వే స్పష్టం చేసింది.

కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీతో విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది. మధ్యప్రదేశ్‌లో 230 సీట్లకు గాను 117 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 90 సీట్లకు గాను 54 సీట్లు, రాజస్థాన్‌లో 200 సీట్లకు గాను 130 సీట్లు గెలిచి సత్తాచాటుతుందని తెలిపింది. మరోవైపు బీజేపీకి మధ్యప్రదేశ్‌లో 106 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 33 రాజస్తాన్‌లో 57 సీట్లు దక్కుతాయని జోస్యం చెప్పింది. 2019 ఎన్నికల ముందు ఈ మూడు రాష్ట్రాల విజయం కాంగ్రెస్‌లో ఉత్సాహాన్ని నింపుతుందని సర్వే వెల్లడించింది. ఈ ఎన్నికలు 2019 ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తే... 2019 ఎన్నికలకు ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు కూడా సర్వే చేయగా... అక్కడి ఓటర్లు మాత్రం కేంద్రంలో బీజేపీ సర్కార్‌కే ఓటు వేశారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని అక్కడి ప్రజలు మొదటి ప్రాధాన్యత ఇవ్వగా ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలిచారు.ఈ మూడు రాష్ట్రాలకు కలిపి మొత్తం 65 లోక్‌సభ స్థానాలున్నాయి.

రాజస్థాన్‌లో రాజేకు కలసిరాని అదృష్టం

రాజస్థాన్‌లో రాజేకు కలసిరాని అదృష్టం

రాజస్థాన్‌లో కాంగ్రెస్ 51శాతం ఓట్లు లభిస్తుండగా... బీజేపీ 37శాతం ఓట్లకే పరిమితం కానుంది. దీంతో కాంగ్రెస్‌కు 130 సీట్లు దక్కనున్నాయి. ఇది 2013కు పూర్తిగా భిన్నంగా ఉంది. 2013 ఎన్నికల్లో బీజేపీకి 163 సీట్లు వచ్చాయి. ఈ ఏడాది మొదట్లో ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు నాలుగు స్థానాలు వచ్చాయి. రెండు పార్లమెంటరీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలను హస్తం పార్టీ గెలుపొందింది. అయితే రాజస్థాన్‌లో తిరిగి బీజేపీని గెలిపించడం సీఎం వసుంధర రాజేకు కష్టమనే చెప్పాలి.

మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్ సింగ్‌పై ప్రజల్లో వ్యతిరేకత

మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్ సింగ్‌పై ప్రజల్లో వ్యతిరేకత

మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజల నుంచి వ్యతిరేకత పొందుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ 42శాతం ఓట్లు సాధించనుండగా... బీజేపీకి 40శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే లెక్కలు కట్టింది. మొత్తం 117 సీట్లు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తుందని సర్వే స్పష్టం చేసింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ 46శాతం ఓట్లతో ముందంజలో ఉంటే... కాంగ్రెస్ 39 శాతం ఓట్లతో వెనకపడింది. ఇక్కడ ప్రధానిగా మోడీకి 54శాతం మంది ప్రజలు అండగా నిలువగా... రాహుల్ గాంధీని వెనకేసుకొచ్చిన వారు 25శాతం మందే ఉన్నారు.

Recommended Video

2019 సార్వత్రిక ఎన్నికలలో టీఆర్ఎస్ గెలిచేనా??
 ఛత్తీస్‌గఢ్‌లో నువ్వా నేనా అనేలా పోరు

ఛత్తీస్‌గఢ్‌లో నువ్వా నేనా అనేలా పోరు

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ కాంగ్రెస్‌ల మధ్య పోరు నువ్వా నేనా అనే స్థాయిలో జరుగుతుందని సర్వే వెల్లడించింది. ఓట్ షేర్ చూస్తే కాంగ్రెస్‌కు 40 శాతం, బీజేపీకి 39 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని సర్వే అభిప్రాయపడింది. మొత్తం 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 54 సీట్లు గెలిచే అవకాశమున్నట్లు సర్వే తెలిపింది. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 46శాతం మంది బీజేపీకి ఓటు వేస్తుండగా... కాంగ్రెస్‌కు ఓటువేసే వారి శాతం 36శాతంగా ఉంది. ఈ రాష్ట్రంలో 56శాతం మంది ప్రజలు తమ ప్రధాని మోడీ అని చెబుతుండగా... 21శాతం మాత్రం రాహుల్ వైపు చూస్తున్నారని సర్వే పేర్కొంది.

English summary
The Bharatiya Janata Party would lose all three of the upcoming Assembly elections in Chhattisgarh, Madhya Pradesh and Rajasthan to the Congress, but the Modi factor would help the party’s fortunes in the Lok Sabha election next year in the three states, a survey conducted by CVOTER and ABP news has predicted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X