Shock: రేప్ చేసి కూతుర్ని చంపిన తండ్రి, ఆవేదనతో అల్లుడి ఆత్మహత్య, నలుగురి జీవితాలు నాశనం !
భోపాల్: ఇంటి నుంచి పారిపోయిన యువతి ప్రియుడిని పెళ్లి చేసుకుని అతనితో కాపురం పెట్టింది. భర్తతో సంతోషంగా ఉంటున్న ఆమెకు ఓ పాప ఉంది. జరిగిందేదో జరిగిపోయిందని మన ఇంటికి రావాలని తండ్రి కూతురికి ఫోన్ చేశాడు. బిడ్డను ఎత్తుకున్న ఆమె తండ్రితో కలిసి పుట్టింటికి వెళ్లింది. తరువాత అటవి ప్రాంతంలో ఆమెతో పాటు ఆమె బిడ్డ శవమై కనిపించారు. వివాహిత మహిళ మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని, ఆమె 8 నెలల పసికందు మీద బండరాళ్లు వేసి దారుణంగా చంపేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. కన్న కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని కసితో ఆమె మీద కన్న తండ్రి అత్యాచారం చేసి చంపేశాడని వెలుగు చూసింది. ఇప్పటికే కూతురిని రేప్ చేసిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. కన్న తండ్రి అత్యాచారం చేసి చంపేసిన మహిళ భర్త కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

యువకుడిని ప్రేమించిన అమ్మాయి
మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలోని రాశిబాద్ లో కమల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కమల్ కు 25 ఏళ్ల వయసు ఉన్న కూతురు ఉంది. వేరు కులానికి చెందిన యువకుడిని కమల్ కూతురు ప్రేమించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కుదరదని కుటుంబ సభ్యులు ఆమెకు తేల్చి చెప్పారు. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఆమె అనుకుంది.

ప్రియుడిని పెళ్లి చేసుకుంది
రెండు సంవత్సరాల క్రితం కమల్ కూతురు ఆమె ప్రేమించిన యువకుడితో పారిపోయింది. ఇంటి నుంచి పారిపోయిన ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకుని అతనితో ఛత్తిస్ గడ్ లో కాపురం పెట్టింది. భర్తతో సంతోషంగా ఉంటున్న ఆమెకు ప్రస్తుతం 8 నెలల పాప ఉంది. కుటుంబ సభ్యులను వదిలేసి వచ్చేసిన భార్యను ఆమె భర్త బాగా చూసుకుంటున్నాడు.

కూతురిని నమ్మించిన కిరాతకుడు
నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుని మాకు దూరం అయ్యావని, మేము అన్ని విషయాలు మరిచిపోయామని, మన ఇంటికి రావాలని కమల్ అతని కూతురిని నమ్మించాడు. తండ్రి కమల్ తో కలిసి కూతురు పుట్టింటికి బయలుదేరింది. సమన్ గడ్ లోని అటవి ప్రాంతంలో కూతురితో పాటు ఆమె బిడ్డ శవమై కనిపించారు. ప్రేమ వివాహిత మహిళను, ఆమె బిడ్డ మీద బండరాళ్లు వేసి దారుణంగా చంపేశారని వెలుగు చూసింది.

కన్నతండ్రి కాలాంతకుడు, కామాంధుడు
వివాహిత మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసింది ఆమె కన్నతండ్రి కమల్ అనే అసలు విషయం తెలుసుకున్న పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. నువ్వు మగాడి మోజులో పడి కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకున్నావని, అందుకే నీ కామం నేనే తీరుస్తానని చెప్పిన కమల్ కూతరి మీద అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడని వెలుగు చూడటంతో అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
Recommended Video

ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న భర్త
తాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను ఆమె కన్నతండ్రి నమ్మించి పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేసి చంపేశాడని ఆమె భర్త ఆవేదన చెందాడు. ఐదు రోజు నుంచి నరకయాతన అనుభవించిన భర్త ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే అతను ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిపెట్టలేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications