Shock: వాటర్ బిల్లు ఎఫెక్ట్, డబ్బు డిమాండ్ చేసిన ఇంటి ఓనర్, ఆత్మహత్య చేసుకున్న దంపతులు !
నాగ్ పూర్/ ముంబాయి: అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న దంపతులు ఇంతకాలం సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవల దంపతులు నివాసం ఉంటున్న ఇంటికి వాటర్ బిల్లు ఎక్కువగా వచ్చిందని తెలిసింది. వాటర్ బిల్లు ఎక్కువ వచ్చిందని, డబ్బులు ఎక్కువగా ఇవ్వాలని ఇంటి యజమాని దంపతులకు సూచించాడని తెలిసింది. ఇదే విషయంలో గొడవపడిన దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

దంపతుల కాపురం
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోని కలమ్నా ప్రాంతంలో మనోజ్ వాసుదేవ్ లోథి అలియాస్ మనోజ్ (45) అనే వ్యక్తి అతని భార్య మమతా (40)తో తో కలిసి నివాసం ఉంటున్నాడు. గౌరీనగర్ కు చెందిన మనోజ్, మమతా దంపతులు కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారని స్థానికులు అంటున్నారు.

నీటి సమస్యలు
ఇష్వక్ షేక్ అనే వ్యక్తి ఇంట్లో మనోజ్, మమతా దంపతులు అద్దెకు ఉంటున్నారు. ప్రతినెల అద్దె డబ్బులు, వాటర్ బిల్లు ఇంటి యజమాని ఇష్వక్ షేక్ కు ఇస్తున్నారు. అయితే గత నెలలో మనోజ్, మమతా దంపతులు నివాసం ఉంటున్న ఇంటికి వాటర్ బిల్లు ఎక్కువగా వచ్చిందని సమాచారం.

వాటర్ బిల్లు ఎక్కువ అడిగిన ఇంటి యజమాని
మీరు ఈనెల ఎక్కువగా నీరు ఉపయోగించారని, వాటర్ బిల్లు ఎక్కువ చెల్లించాలని ఇంటి యజమాని ఇష్వక్ పేక్ అద్దెకు ఉంటున్న మనోజ్, మమతా దంపతులకు చెప్పాడు. నవ్వు ఎందుకు నీళ్లు ఎక్కువగా వాడావు అంటూ మనోజ్ అతని భార్య మమతా మీద మండిపడ్డాడని తెలిసింది. ఇదే విషయంలో గొడవపడిన మనోజ్, మమతా దంపతులు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

మెడికల్ కాలేజ్ కు దానం చెయ్యాలని డెత్ నోట్
ఆత్మహత్య చేసుకునే ముందు డోత్ నోట్ రాసిన మనోజ్, మమతా దంపతులు మా శవాలు మెడికల్ కాలేజ్ కు దానం చెయ్యాలని రాసిపెట్టారని పోలీసులు అన్నారు. ఇంటి యజమాని ఇష్వక్ షేక్ టార్చర్ కారణంగా మనోజ్, మమతా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారా ? మరేమైనా కారణాలు ఉన్నాయా ?అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications