వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాథేమాకు షాక్: కేసు నమోదు, డేరా బాబా బాటలోనే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై :డేరాబాబా అరెస్టై జైలుల్లో శిక్షను అనుభవిస్తున్న తరుణంలో మరో వివాదాస్పద రాథేమాపై ఎప్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రాథేమాకు కూడ కష్టాలు తప్పేలా లేవు.

Shock for Radhe Maa; days after Ram Rahim jailed for rape, court orders FIR against her

తనని తాను దేవతగా చెప్పుకుంటున్న రాథేమాకు కష్టకాలం ఎదురైంది. పంజాబ్‌లోని ఫగ్వాడాకు చెందిన సురేంద్ర మిట్టల్.. హైకోర్టులో ఆమె వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని అప్పీలు చేశాడు. దీనికి ముందు ముంబైకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్... బోరీవలీ పోలీసు స్టేషన్‌లో రాధేమాపై ఫిర్యాదు చేశాడు.

రాధేమా మాజీ భక్తులు చెప్పనదాని ప్రకారం ఆమె డబ్బులు తీసుకోకుండా ఏ పనీ చేయదు. సురేంద్ర మిట్టల్ తన ఫిర్యాదు అనంతరం రాధేమా నుంచి బెదిరింపులు ఎదుర్యాయని ఆయన చెప్పాడు. తాను ఆమెపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయాడు. ముంబైకి చెందిన ప్రముఖ 'ఎంఎం మిఠాయి వాలా' యజమాని మన్మోహన్ గుప్తాను రాధేమా తీవ్ర వేధింపులకు గురిచేసిందని ఆయన ఫిర్యాదు చేశాడు.

తన కుమారుని బంగ్లాను స్వాధీనం చేసుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నదని అతను పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా రాథేమా తన భక్తుల ఇంటికి వెళ్లేందుకు, దర్శనమిచ్చేందుకు ముందుగానే రేటు ఫిక్స్‌చేస్తుంది. ఇందుకోసం రూ. 5 లక్షల నుంచి 35 లక్షల వరకూ వసూలు చేస్తుందని ఆరోపణలున్నాయి.

భక్తుల ఆర్థిక స్థితిని అనుసరించి ఈ రేట్లు ఉంటాయి. ఈ వ్యవహారాలను రాధేమా డీలింగ్ ఏజెంట్ టల్లీ బాబా చూసుకుంటాడు. భారీగా సొమ్మలు చెల్లించి రాధేమాను ఇంటికి ఆహ్వానించిన వాళ్లకు ఆమెను హగ్ చేసుకునే అవకాశం దక్కుతుంది.

రాధేమా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన ఒక సిక్కు కుటుంబంలో జన్మించింది. ఆమెకు పంజాబ్‌కు చెందిన వ్యాపారి మోహన్‌సింగ్‌తో వివాహమైంది.

పెళ్లయిన కొద్ది రోజులకే రాధేమా ఆధ్యాత్మిక జీవితాన్నిప్రారంభించింది. కొంతకాలం తరువాత తన మకాంను ముంబైకి మార్చింది. ఇక్కడ రాధేమాకు పేరు ప్రఖ్యాతులు లభించాయి.

మిట్టల్ పిర్యాదు మేరకు పంజాబ్ హైకోర్టు రాథేమాపై ఎప్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశం మేరకు పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
It is a shock for controversial and self-styled godwoman Radhe Maa. Days after Dera chief Ram Rahim was sent to jail for raping two sadhvis, Punjab & Haryana High Court has directed Punjab Police to file FIR against Radhe Maa. The court took action after a plea was filed by Phagwara resident Surender Mittal,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X