శశికళకు అనుకోని షాక్: 43మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్, పన్నీరు క్యాంపుకే
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు పలువురు ఎమ్మెల్యేలు అనుకోని షాకిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు పలువురు ఎమ్మెల్యేలు అనుకోని షాకిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తనకు మద్దతిస్తున్న సుమారు 130మంది ఎమ్మెల్యేలను కట్టుదిట్టమైన భద్రత మధ్య పలు బస్సులలో రిసార్టులు, హోటళ్లకు శశికళ తరలించిన విషయం తెలిసిందే. జంప్ అవుతారేమోననే సందేహంతో వారి వద్ద ఉన్న సెల్‌పోన్లను కూడా భద్రత సిబ్బంది స్వాధీనం చేకున్నారు.
కాగా, శశికళ క్యాంపులోని సుమారు 43మంది మిస్సైనట్లు తెలిసింది. వీరంతా సీఎం పన్నీరుసెల్వం క్యాంపులోకి చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 22మంది ఎమ్మెల్యేలు పన్నీరుకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఆయన మాత్రం తనకు 50మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో శశికళ క్యాంపులోని 43మంది ఎమ్మెల్యేలు పన్నీరు క్యాంపులో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాక, తనకు 130మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గట్టిగా చెప్పిన శశికళకు ఈ పరిణామం అనుకోని షాకేనని చెప్పవచ్చు. కాగా, ప్రభుత్వం నిలబడాలంటే 233మంది ఎమ్మెల్యేలున్న తమిళనాడు అసెంబ్లీలో కనీసం 117మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది.
ప్రస్తుతం శశికళకు మద్దతు పలుకుతున్నారన్న 130మందిలో 43మంది వెళ్లిపోతే ఆమె వద్ద మిగిలేది 80-90మంది మాత్రమే. వారిలో కూడా ఎంతమంది కడవరకు శశికళకు మద్దతిస్తారో తెలియదు. ఈ క్రమంలో వారి మద్దతు శశికళ సీఎంగా ప్రమాణం చేసినా.. సభలో కావాల్సిన బలం లేని కారణంగా వెంటనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మళ్లీ పన్నీరు సెల్వంకు అనుకూల పరిస్థితిగా మారే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications