బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: పోలీసు కమీషర్ ఆఫీసు పక్కలో చేతివాటం ?, కారులో లక్షలు లూటీ, సీసీటీవీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో కిలాడీలు మరోసారి చేతివాటం చూపించారు. బెంగళూరులో నిత్యం ఎక్కడో అక్కడ ఇళ్లల్లో చోరీలు, దొంగతనాలు, దారి దోపిడీలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈసారి నిందితులు ధైర్యం చేసి బెంగళూరు సిటీ పోలీస్ బాస్ కార్యాలయం సమీపంలో పట్టపగలు బరి తెగించి కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న లక్షల రూపాయల నగదు లూటీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. నిందితులు దర్జాగా నగదు లూటీ చేసి పల్సర్ బైక్ లో పారిపోతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

Illegal affair: ప్రియుడి మోజులో పడిన భార్య, భర్తకు చిన్నగాయం కాకుండా నిద్రలోనే చంపేసిన భార్య, స్కెచ్ !Illegal affair: ప్రియుడి మోజులో పడిన భార్య, భర్తకు చిన్నగాయం కాకుండా నిద్రలోనే చంపేసిన భార్య, స్కెచ్ !

 బ్యాంకు లోన్ డబ్బులు

బ్యాంకు లోన్ డబ్బులు

బెంగళూరు నగరంలోని మహదేవపురలో లక్షీశ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లక్ష్మీశ ఇంటి ఇఎంఐ కట్టడానికి శనివారం ఇండియన్ ఎక్స్ ప్రెస్ సర్కిల్ సమీపంలోని కెనరా బ్యాంకుకు వెళ్లారు. ఆ సందర్బంలో రూ. 4.50 లక్షలు బ్యాంకులో కట్టడానికి పాన్ కార్డు అవసరం అని బ్యాంకు సిబ్బంది చెప్పారు.

 ఫ్రెండ్ కోసం వెళ్లాడు

ఫ్రెండ్ కోసం వెళ్లాడు

పాన్ కార్డు లేకపోవడంతో బ్యాంకులో డబ్బులు తరువాత కడితే సరిపోతుంది అనుకున్న లక్ష్మీశ డబ్బులు వెనక్కి తీసుకుని కారులో పెట్టాడు. ఇంటికి వెలుతున్న సమయంలో బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయం సమీంలోని కార్యాలయంలో పని చేస్తున్న స్నేహితుడిని మాట్లాడటానికి వెళ్లాడు

 కారులో రూ. 4.50 లక్షలు లూటీ

కారులో రూ. 4.50 లక్షలు లూటీ

ఆ సందర్బంలో కారులోనే బ్యాంకు ఇఎమ్ఐకి కట్టడానికి తీసుకెళ్లిన రూ. 4.50 లక్షలు ఉన్న బ్యాగ్ అక్కడే పెట్టి వెళ్లాడు. ఫ్రెండ్ మాట్లాడి వచ్చి చూసే సరికి తన కారు అద్దాలు పగలగొట్టిన నిందితులు అందులోని రూ. 4.50 లక్షలు లూటీ చేశారని లక్ష్మీశ పోలీసులను ఆశ్రయించాడు.

 కమీషనర్ ఆఫీసు పక్కలో చేతివాటం ?

కమీషనర్ ఆఫీసు పక్కలో చేతివాటం ?

నిందితులు లక్ష్మీశ కారు అద్దాలు పగలగొట్టి సమీపంలో పల్సర్ బైక్ లో ఉన్న మరో నిందితుడితో పారిపోతున్న సమయంలో రికార్డు అయిన సీసీటీవీ క్లిప్పింగ్స్ చూసిన పోలీసులు హడలిపోయారు. బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయం సమీపంలోనే కారులో పెద్ద మొత్తంలో నగదు చోరీ కావడం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Shock The thieves stole the money in front of the City Police Commissioners office in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X