వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Goa assembly polls: గోవాలో కాంగ్రెస్ కు షాక్: ప్రియాంకా గాంధీ పర్యటనలో రాజీనామాల పర్వం

|
Google Oneindia TeluguNews

గోవాలో 2022 ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా గోవాలో కాంగ్రెస్ పార్టీ వరుస రాజీనామాలను ఎదుర్కొంటుంది. గోవా రాష్ట్రంలో రాబోయే ఎన్నికల కోసం భావసారూప్యత గల పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ వర్గాలలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం నాడు గోవా పర్యటన నేపథ్యంలో తాజా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి షాక్ అనే చెప్పాలి.

ప్రియాంకా గాంధీ వాద్రాకు గోవాలో ఊహించని షాక్

ప్రియాంకా గాంధీ వాద్రాకు గోవాలో ఊహించని షాక్

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలకు ప్రియాంకాగాంధీ సన్నద్ధమవుతున్న సమయంలోనే వరుసగా రాజీనామాలను సమర్పించారు. పోర్వోరిమ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతల బృందం శుక్రవారం ఉదయం తమ రాజీనామాలను సమర్పించింది. 2022 ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై కాంగ్రెస్ సీరియస్‌గా లేదని స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ ఖౌంటే మద్దతు ఉన్న బృందం పేర్కొంది.

కాంగ్రెస్ లో ఎన్నికల్లో పోటీ చేసే సీరియస్ నెస్ లేదని పలువురి రాజీనామా

కాంగ్రెస్ లో ఎన్నికల్లో పోటీ చేసే సీరియస్ నెస్ లేదని పలువురి రాజీనామా

రాబోయే గోవా ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆసక్తిగా ఉన్నట్లు కనిపించడం లేదని రాజీనామాలు చేసిన వారు ఆరోపించారు. కొంతమంది నాయకుల వైఖరి కారణంగా గోవాలో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండేలా కనిపించడం లేదని పోర్వోరిమ్ నుండి బృందానికి నాయకత్వం వహించిన మాజీ జిల్లా పంచాయతీ సభ్యుడు గుపేష్ నాయక్ విలేకరులతో అన్నారు. కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలి సౌత్ గోవాకు చెందిన దాని సీనియర్ నాయకుడు మొరెనో రెబెలో తన రాజీనామాను సమర్పించారు.

 కర్టోరిమ్ నియోజకవర్గంలోనూ రాజీనామాల పర్వం

కర్టోరిమ్ నియోజకవర్గంలోనూ రాజీనామాల పర్వం


కర్టోరిమ్ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే అలీక్సో రెజినాల్డో లౌరెన్కోకు పార్టీ అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత తాను కలత చెందానని రెబెలో రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. రెబెలో కర్టోరిమ్‌కు చెందినవారు. గత నాలుగున్నరేళ్లుగా పార్టీ కార్యకలాపాల్లో ఎప్పుడూ పాల్గొనని, మిమ్మల్ని దుర్భాషలాడిన అలీక్సో రెజినాల్డో లౌరెన్కో ఇటీవల జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నుండి పోటీ చేసిన కర్టోరిమ్ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని , అలాంటి వ్యక్తి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారని రెబెలో గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (జిపిసిసి) అధ్యక్షుడు గిరీష్ చోడంకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

గోవా ఫార్వర్డ్ పార్టీ (జిఎఫ్‌పి)తో చేసుకున్న అవగాహనపై కాంగ్రెస్‌లో విభేదాలు?

గోవా ఫార్వర్డ్ పార్టీ (జిఎఫ్‌పి)తో చేసుకున్న అవగాహనపై కాంగ్రెస్‌లో విభేదాలు?


అసెంబ్లీ ఎన్నికల కోసం గోవా ఫార్వర్డ్ పార్టీ (జిఎఫ్‌పి)తో చేసుకున్న అవగాహనపై కాంగ్రెస్‌లో విభేదాలు రావడంతో రాజీనామాల పరంపర జరిగింది. ఏఐసిసి గోవా ఎన్నికల ఇన్‌ఛార్జ్ పి చిదంబరం గురువారం మాట్లాడుతూ గోవా ఫార్వర్డ్ పార్టీ కాంగ్రెస్‌కు మాత్రమే మద్దతునిచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దినేష్ గుండూరావు శనివారం గోవా ఫార్వర్డ్ పార్టీ చీఫ్ విజయ్ సర్దేశాయ్ మరియు చోడంకర్ మధ్య సమావేశాన్ని ప్రతిపాదించారు. పనాజీలో విలేకరులతో మాట్లాడిన చిదంబరం,ఇప్పటివరకు మనకు ఒక పార్టీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ ఢిల్లీకి వచ్చి, 'బీజేపీని ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీకి మా పార్టీ మద్దతు ఇస్తుంది' అని అన్నారు. రాహుల్ గాంధీ మద్దతును అంగీకరిస్తున్నామని చెప్పారు. అన్ని ఇతర వివరాలు మరింత చర్చించవలసి ఉందని వెల్లడించారు.

English summary
Congress party leaders have given an unexpected shock to Congress general secretary Priyanka Gandhi Vadra.A group of Congress leaders from the Porvorim Assembly constituency submitted their resignations before the meetings of Priyanka Gandhi .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X