షాకింగ్: ఐసిస్‌లో చేరిన వ్యాపారవేత్త కుటుంబం
ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త కుటుంబం ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరిన ఘటన కలకలంగా సృష్టించింది. ఇటీవల కేరళకు చెందిన పది మందిఐసిస్ సంస్థలో చేరిన ఘటన మరువకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.
ముంబైకి చెందిన అబ్దుల్ మజీద్ అనే వ్యాపారవేత్త కుమారుడు అష్‌ఫక్ అహ్మద్, భార్య, పిల్లలు, సోదరులతో కలిసి ఐసిస్‌లో చేరిపోయాడు. అహ్మద్ తన కుటుంబంతో కలిసి జూన్‌లో విదేశాలకు వెళ్లాడు.

ఆ తర్వాత అందరితో కలిసి ఉగ్రసంస్థలో చేరిపోయామని ఇంకెప్పుడూ భారత్‌కు తిరిగిరామని అహ్మద్ తన సోదరుడికి మెసేజ్ పెట్టాడు. దీంతో అహ్మద్ తండ్రి మజీద్ పోలీసులను ఆశ్రయించాడు.
కేరళలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రషీద్, ఇస్లాం మతగురువు హనీఫ్‌లు తన కుమారుడు అఫ్‌షక్‌తో కలిసి సిరియా వెళ్లాడని ఆ తర్వాత అతను తన కుమారుడి మనసు మార్చేసి ఐసిస్‌లో చేరేలా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ముంబై పోలీసులు హనీఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


Click it and Unblock the Notifications