ఐటీ నగరంలో ఇంత ఘోరమా?: నడివీధిలో అమ్మాయిని లాగిపట్టి..(వీడియో)
ఓ అమ్మాయి వీధి గుండా వెళుతున్న సమయంలో ఇద్దరు బైక్‌పై ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేశారు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని, ఐటీ రంగంలో ప్రముఖ నగరంగా వెలుగొందుతున్న బెంగళూరులో ఇప్పుడు అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. మొన్నటి మొన్న కొత్త సంవత్సరం సంబరాల్లో వేలాదిమంది పోలీసులు ఉండగానే రెచ్చిపోయిన కామాంధులు.. అమ్మాయిలను తాకరాని చోట్ల తాకుతూ, బట్టలు చించివేసి వికృత చేష్టలకు ఒడిగట్టారు. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది.
ఓ అమ్మాయి వీధి గుండా వెళుతున్న సమయంలో ఇద్దరు బైక్‌పై ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేశారు. అమ్మాయిని అడ్డంగించిన దుండగుడు, ఆమెను లాగి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై లైంగికంగా వేధించాడు. తాకరాని చోట్ల తాకుతూ వేధించాడు. బైక్ వద్దకు తీసుకెళ్ళి ఆమెపై దాడి చేశాడు.

అమ్మాయిని తీవ్రంగా వేధించిన అనంతరం ఆ దుండగుడు.. ఆమెను నేలకేసి కొట్టి పరారయ్యారు. కాగా, ఈ ఘటన జరుగుతుండగా వీధి చివరన కొంత మంది బైకులపై ఆగి చూస్తున్నారే తప్ప.. ఆమెను కాపాడేందుకు ముందుకు రాకపోవడం విచారకరం. ఈ ఘటనతో భయాందోళనకు గురైన సదరు యువతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనట్లు సమాచారం.
#Correction #CaughtonCam: Two scooter-borne men molest a girl in Kammanahalli area in Bengaluru (Source: Unverified) pic.twitter.com/fAKPfMkoOz
— ANI (@ANI_news) 4 January 2017
కమ్మనహళ్లి వీధిలో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటన బెంగళూరులో అమ్మాయిలకు రక్షణ ఏపాటితో తెలియజేస్తోందని పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా బెంగళూరు పోలీసులు ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, తాజా ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications