ఇన్సురెన్స్ డబ్బుల కోసం ప్లాస్టిక్ బొమ్మకు అంత్యక్రియలు.. ఇదేం ట్విస్ట్ రా నాయనా..!
ఉత్తర్ ప్రదేశ్ లోని హాపూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. దిల్లీ నుంచి వచ్చిన ఓ కుటుంబం శవానికి బదులుగా ప్లాస్టిక్ బొమ్మకు అంత్యక్రియలు నిర్వహించేందుకు యత్నించింది. యూపీ.. హాపూర్ లోని పవిత్రమైన బ్రిజ్ ఘాట్ వద్ద ఉన్న ఘర్ ముక్తేశ్వర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్లాస్టిక్ బొమ్మను అంత్యక్రియలకోసం తీసుకురావడంపై స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటివరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ సాగుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని హాపూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. దిల్లీకి చెందిన ఓ ఫ్యామిలీ ఉత్తర్ ప్రదేశ్ లోని హాపూర్ లో ఉన్న బ్రిజ్ ఘాట్ వద్దకు అంత్యక్రియల కోసం వచ్చింది. సాధారణంగా ఈ ప్రాంతంలో అనేక శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే అక్కడ ఉన్నవాళ్లు కూడా అదే భావించారు. అంత్యక్రియలకోసం ఓ పూజారిని కూడా ఏర్పాటు చేశారు. చితి పేర్చి మెల్లగా ప్లాస్టిక్ బొమ్మను దానిపై ఉంచారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అయితే పూజారి ప్లాస్టిక్ బొమ్మపై కప్పిన వస్త్రాన్ని తీశాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది శవం కాదు.. ఓ ప్లాస్టిక్ బొమ్మ. స్థానికులు కూడా అది ప్లాస్టిక్ బొమ్మ అని గుర్తించి కంగుతిన్నారు. పవిత్రమైన ఘాట్ వద్ద ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆ కుటంబంపై అనుమానం వచ్చింది. వెంటనే అంత్యక్రియల కార్యక్రమాన్ని ఆపేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోపు వాళ్లు అక్కడి నుంచి పరార్ అయ్యేందుకు యత్నించారు. అయితే వారిలో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
हापुड़ : हापुड़ से चौंकाने वाली खबर आई सामने
— India News UP/UK (@IndiaNewsUP_UK) November 27, 2025
शव की जगह पुतला लेकर पहुंचा परिवार
ब्रजघाट में अंतिम संस्कार करने पहुँचा परिवार
दिल्ली से अंतिम संस्कार करने आया था परिवार
पुलिस ने दो लोगों को हिरासत में लिया, जांच जारी —
गढ़ कोतवाली ब्रजघाट मामला
#DummyCorpseScam… pic.twitter.com/T1pgholdYE
దుండగులు.. ప్లాస్టిక్ బాడీకి ఎందుకు అంత్యక్రియలు చేశారా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇన్సురెన్సు డబ్బుల కోసం ఇలా చేస్తున్నారా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్నదానిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ వాళ్లు ఏమైనా హత్యకు పాల్పడి ఉంటే శవాన్ని ఎక్కడ మాయం చేశారన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications