దారుణం: బతికుండగానే కుటుంబానికి నిప్పుపెట్టారు
ఫరిదాబాద్: హర్యానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బల్లభ్‌గఢ్‌లోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు బతికుండగానే నిప్పంటించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
మంగళవారం వేకువ జామున దాదాపు 4గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో అవతలి వర్గం వారు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
నలుగురు బాధితులను ఢిల్లీలోని సప్థార్ జంగ్ ఆస్పత్రికి చికిత్స కోసం అత్యవసరంగా తరలించారు. దళిత కుటుంబానికి చెందిన ఈ నలుగురు బాధితుల్లో ఇద్దరు చిన్నారులు తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మంగళవారం రాత్రి బాధితులు తమ ఇంట్లో నిద్రిస్తుండగా దుండగులు వారి ఇంటికి నిప్పుపెట్టారని స్థానికులు చెబుతున్నారు.
మద్రాస్ ఐఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
మద్రాస్ ఐఐటీలో బీటెక్ ఫైనలియర్ విద్యార్థి రాహుల్‌ప్రసాద్(22) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఐటలో నెల వ్యవధిలోనే రెండో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కేరళలోని కొల్లాం వాసి అయిన రాహుల్‌ప్రసాద్ తన హాస్టల్ రూమ్‌లో నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని సోమవారం పోలీసులు తెలిపారు.
అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదన్నారు. పరీక్ష సరిగ్గా రాయకపోవడంతో మనస్తాపానికి గురై హాస్టల్‌కు వెళ్లాడన్నారు. కళాశాల యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
మృతుడి వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ లేదని.. అతని మృతి కారణాలు తమ దర్యాప్తులో తెలుస్తాయని పోలీసు అధికారి చెప్పారు. కాగా, సెప్టెంబర్ 21న ఎంటెక్ విద్యార్థి నాగేంద్రకుమార్‌రెడ్డి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications