తాజ్ మహల్ వద్ద షాకింగ్ ఘటన.. ఓ మహిళ ఏం చేసిందంటే ?
ప్రఖ్యాత తాజ్ మహల్ వద్ద షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఊహించని ఈ చర్యతో భద్రత వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఈ చర్యకు పాల్పడిన మహిళ.. ఈ తరహాలోనే అంతకు ముందు కూడా మరో ఘటనకు పాల్పడడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ABHM కి చెందిన ఒక మహిళ మహాశివరాత్రి సందర్భంగా తాజ్‌మహల్ ఆవరణలో శివలింగానికి అగరబత్తులు వెలిగించి, జలాభిషేకం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలానే ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. తాను ప్రయాగ్‌రాజ్‌లోని సంగం నుంచి పవిత్ర గంగాజలాన్ని తీసుకువచ్చానని చెప్పింది. తాజ్ మహల్ వద్ద కర్మ చేయడానికి ఒక చిన్న శివలింగాన్ని తీసుకువెళ్లానని, ఇది వారసత్వ నిర్మాణాన్ని 'శుద్ధి' చేయడానికి ఉద్దేశించినదని పేర్కొంది.

ఈ ఘటనకు పాల్పడిన మహిళను ABHM మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మహిళ మీరా రాథోడ్ గా గుర్తించారు. ఆమె గతంలో కూడా జూలై 2024లో సావన్ నెల రెండవ సోమవారం నాడు, రాథోడ్ తాజ్ మహల్ వద్ద గంగాజలాన్ని సమర్పించడానికి కన్వర్ తో వచ్చారు. అయితే ప్రవేశ ద్వారం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకుని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. భోలే బాబా తన కలలో వచ్చాడని, కన్వర్‌ని తీసుకురావాలని ఆదేశించడంతో, పోలీసులు సమీపంలోని శివాలయంలో నైవేద్యాన్ని అందించారు. అయినప్పటికీ, రాథోడ్ ఆగష్టు 5, 2024న తాజ్ మహల్‌లో గంగాజల్‌ను విజయవంతంగా అందించారు, ఆ తర్వాత ఆమెను సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పడంతో ఆమెను విడుదల చేశారు.
స్మారక చిహ్నం లోపల అగ్గిపుల్లలు, అగరబత్తీలు, విగ్రహాలు లేదా పూజలు నిర్వహించడం నిషేధించబడింది. అయినప్పటికీ మహిళ ఈ రకంగా చేయడం పట్ల భద్రతా వైఫల్యం ఉందంటూ పలువురు ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications