సిగరెట్ తాగుతూ.. మద్యం సేవిస్తూ.. అర్ధనగ్నంగా కోర్టు విచారణకు వ్యక్తి !!
దేశ రాజధాని ఢిల్లీలో సభ్య సమాజం సైతం నివ్వెరపోయే ఘటన చోటు చేసుకుంది. సిగరెట్ తాగుతూ.. మద్యం సేవిస్తూ.. అర్ధనగ్నంగా ఓ వ్యక్తి కోర్టు విచారణకు హాజరు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ అనూహ్య ఘటనపై ఢిల్లీ కోర్టు తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. తక్షణమే సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
గత నెల సెప్టెంబర్ 16, 17 తేదీల్లో వెబ్‌ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఢిల్లీ కోర్టు విచారణలు జరుగుతున్నాయి. ఈ సమయంలో 'అకిబ్ అఖ్లక్' అనే యూజర్ ఐడీతో ఒక వ్యక్తి లాగిన్ అయ్యాడు. అతడు కేవలం లోదుస్తులు మాత్రమే ధరించి.. సిగరెట్ తాగుతూ.. మద్యం సేవిస్తూ కెమెరా ముందు కనిపించడం కోర్టు సిబ్బంది, న్యాయమూర్తి అవాక్కు అయ్యారు. తక్షణమే విచారణ నిలిపివేసి సాంకేతిక బృందాన్ని అప్రమత్తం చేశారు. ఆ వ్యక్తి చర్యలు కోర్టును అగౌరవపరిచే విధంగా చేసినందుకు గాను కఠిన చర్యలకు ఆదేశించింది.

అయితే న్యాయస్థానం ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల ద్వారా ఆన్‌లైన్ లాగిన్ వివరాలను ట్రాక్ చేయగా.. ఆ యూజర్‌ను న్యూఢిల్లీ లోని గోకుల్‌పురి ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ గా గుర్తించారు. ఇమ్రాన్ తరచుగా తన నివాసాన్ని మార్చుకుంటూ ఉండటంతో అతన్ని పట్టుకోవడానికి కొంత సమయం పట్టిందని పోలీసులు వివరించారు. చివరకు అతన్ని అరెస్ట్ చేసి.. విచారణకు హాజరు కావడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్, సిమ్ కార్డు, వైఫై రూటర్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఇమ్రాన్ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్..
కాగా పోలీసుల విచారణలో ఇమ్రాన్ ఒక పాత నేరస్థుడు అని బయటపడింది. ఢిల్లీ వ్యాప్తంగా అతనిపై 50కి పైగా దోపిడీ, హింసాత్మక చర్యల కేసులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అంతే కాకుండా గతంలో కూడా సైబర్ మోసాలు సహా పలు కేసుల్లో జైలుకు వెళ్లినట్లు తెలిపారు. కాగా పోలీసుల విచారణలో ఆన్‌లైన్ విచారణల్లో ఏమి జరుగుతుందో చూడాలనే ఆసక్తితోనే సరదాగా లాగిన్ అయ్యానని చెప్పినట్టు సమాచారం.
తన స్నేహితుడు ఇచ్చిన లింక్ ద్వారా కోర్టు సెషన్‌కి ప్రవేశించానని ఒప్పుకున్నట్టు అధికారులు తెలిపారు. సదరు సమాధానంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. ఈ లింక్ అతనికి ఎలా దొరికిందన్న కోణంలో సైబర్ సెక్యూరిటీ యూనిట్ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది. కోర్టు లింక్ బయటకు ఎలా లీక్ అయ్యిందనే అంశాలపై న్యాయవర్గాలు చర్చిస్తున్నాయి.
కోర్టు హెచ్చరిక
కోర్టు ఆన్‌లైన్‌లో జరిగినా అది కోర్టేనని విచారణకు హాజరయ్యే ప్రతీ ఒక్కరు గౌరవం, శ్రద్ధతో ప్రవర్తించాలని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తనను క్షమించబోమని హెచ్చరించింది. ఇక కరోనా తర్వాత ఇ-కోర్ట్ వ్యవస్థ విస్తృతంగా అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications