వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్...బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు దీపికా పదుకొనే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లకు ఉపాధి హామీ కార్డులు

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు జారీ కావడం ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారింది. దీపికా పదుకొనే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లకు మధ్యప్రదేశ్ లో ఖార్గోన్ జిల్లాలో జాతీయ ఉపాధి పథకం క్రింద జాబ్ కార్డులు జారీ అయ్యాయి. వీరు మాత్రమే కాదు సినీ ప్రముఖుల పేరుతో 11 మంది ఫేక్ జాబ్ కార్డులను గుర్తించినట్టు తెలుస్తుంది .

తన మేనేజర్ తో డ్రగ్ చాటింగ్ నిజమేనన్న దీపికా పదుకొనే .. ఎన్సీబీకి ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పకుండాతన మేనేజర్ తో డ్రగ్ చాటింగ్ నిజమేనన్న దీపికా పదుకొనే .. ఎన్సీబీకి ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పకుండా

 పీపర్ ఖేడా నాకా గ్రామంలో బాలీవుడ్ స్టార్స్ ఉపాధి హామీ కార్డులు

పీపర్ ఖేడా నాకా గ్రామంలో బాలీవుడ్ స్టార్స్ ఉపాధి హామీ కార్డులు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దీపికా పదుకొనే , జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లకు జారీ అయిన జాబ్ కార్డుల ప్రకారం అక్కడ వారు ఉపాధి హామీ కార్మికులుగా పనిచేస్తున్నారు. అంతేకాదు వీళ్ళ పేరుమీద పని చేసినట్టు లక్షల్లో డబ్బులు కూడా తీసుకున్నారు. జూన్ మరియు జూలై నెలలకు వారికి వేతనాలు కూడా తీసుకున్నారు . జర్నీయా పంచాయతీలోని పీపర్ ఖేడా నాకా గ్రామంలో ఇలాంటి ఫేక్ కార్డులు పదికి పైగా వినియోగించబడ్డాయని , అసలు లబ్ధిదారుల ఫోటోలు లేకుండా, బాలీవుడ్ తారల ఫోటోలతో ఫేక్ కార్డులు సృష్టించబడ్డాయి అని తాజాగా గుర్తించారు.

ఏడాదికి 100 కోట్లకు పైగా దీపికా ఆదాయం .. అలాంటి దీపికాకు ఉపాధి హామీ కార్డు

ఏడాదికి 100 కోట్లకు పైగా దీపికా ఆదాయం .. అలాంటి దీపికాకు ఉపాధి హామీ కార్డు

దీపికా పదుకొనే బాలీవుడ్ టాప్ హీరోయిన్. ఆమె ఒక సినిమాకు దాదాపుగా 29 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇంకా యాడ్స్, బ్రాండింగ్స్ ఇలా ఒక్కటేమిటి ఆమె ఆదాయానికి కొదవే లేదు. ఏడాదికి వంద కోట్లకు పైగా దీపికాపదుకునే సంపాదిస్తుంది. అంత ఆదాయం ఉన్న దీపికా పదుకొనే ఉపాధి హామీ కూలికి వెళ్తున్నారు అంటూ జాబ్ కార్డు సృష్టించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్క దీపిక మాత్రమే కాదు మరో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఉపాధి హామీ పనికి వెళుతున్నారని జాబ్ కార్డులు సృష్టించారు. ఇక వీరిద్దరి పేరు తో తయారైన జాబ్ కార్డులు పురుషుల జాబితాలో ఉన్నాయి .

ఫేక్ జాబ్ కార్డుల వ్యవహారంపై సీరియస్ అయిన కలెక్టర్ .. విచారణకు ఆదేశం

ఫేక్ జాబ్ కార్డుల వ్యవహారంపై సీరియస్ అయిన కలెక్టర్ .. విచారణకు ఆదేశం

ఈ ఫేక్ జాబ్ కార్డుల వ్యవహారాన్ని గుర్తించిన ఖార్గోన్ జిల్లా కలెక్టర్ వెంటనే అన్ని జాబ్ కార్డులను తనిఖీ చేయాలని, ఫేక్ కార్డులను గుర్తించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ సీఈవోను ఆదేశించారు.ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి వారు ఒక బృందాన్ని పీపర్‌ఖేడా నాకాకు పంపినట్లు జిల్లా పంచాయతీ సీఈఓ తెలిపారు. పోర్టల్‌లో బాలీవుడ్ నటీమణుల ఫోటోలతో కూడిన 11 జాబ్ కార్డుల గురించి వారికి సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు .

Recommended Video

#Prabhas21 Big Update : Amitabh Bachchan Joins Prabhas, Nag Ashwin's New Film
ప్రతినెలా వారి పేరుతో వేతనం .. బాలీవుడ్ లో పెద్ద చర్చ

ప్రతినెలా వారి పేరుతో వేతనం .. బాలీవుడ్ లో పెద్ద చర్చ

బాలీవుడ్ తారల పేరుతో ఫేక్ కార్డులను జాతీయ ఉపాధి హామీ పనుల క్రింద చెరువులు, కాలువ మరమ్మతు నిర్మాణానికి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు . ప్రతి నెలా వారి పేరు మీద రూ .30,000 నగదు తీసుకుంటున్నట్టు చెప్పారు. గ్రామ సర్పంచ్, కార్యదర్శి కలిసి చేతివాటం చూపించినట్లుగా గుర్తించిన అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే ఈ ఫేక్ జాబ్ కార్డుల వ్యవహారాన్ని తేలుస్తామని చెప్తున్నారు. కానీ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ల ఫోటోలతో గతంలో ఎన్నడూ లేని విధంగా జాబ్ కార్డులు జారీ కావటం మాత్రం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి .

English summary
If photos on MGNREGA job cards in Madhya Pradesh are to be believed then Bollywood actors Deepika Padukone and Jacqueline Fernandes are working as MGNREGA labourers in the state's Khargone district. More than 10 such cards have been used in the Peeparkheda Naka village in Jhirnia panchayat where the pictures of the actual beneficiaries were replaced with Bollywood celebrities and lakhs have been withdrawn using such cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X