దారుణం.. భార్య అందాన్ని చూసి ఓర్వలేక గుండు గీసిన కిరాతక భర్త!
భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కానీ కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా తోడలబాగి గ్రామంలో జరిగిన ఈ గొడవ వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఉమేష్ అనే వ్యక్తి తన భార్య లక్ష్మీబాయి ప్రవర్తన మీద అనవసరమైన అనుమానం పెంచుకున్నాడు. ఏదో పనికిరాని విషయాల మీద రోజు ఇంటికి వచ్చి గొడవ పడేవాడు. ఆ రోజు రాత్రి కూడా ఫుల్‌గా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. అనుమానం మత్తుకు మద్యం మత్తు తోడైతే ఇక చెప్పేదేముంది? విచక్షణ కోల్పోయి అమానుషంగా ప్రవర్తించాడు.
కొడవలితో భయపెట్టి.. గుండు గీశాడు!
మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఉమేష్ భార్యతో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న చెరకు కోసే కొడవలిని తీసి ఆమెను చంపేస్తానని బెదిరించాడు. పాపం ఆ మహిళ భయంతో వణికిపోతున్నా కనికరం లేకుండా ఆమెను బలవంతంగా ఈడ్చుకెళ్లి కూర్చుబెట్టాడు. మద్యం మత్తులో ఊగిపోతూ ఆమె జుట్టును పూర్తిగా గుండు గీశాడు. ఒక ఆడపిల్లకు జుట్టు అనేది ఎంత ముఖ్యమో తెలిసి కూడా ఆమెను అవమానించాలని ఈ వికృతమైన పనికి ఒడిగట్టాడు.

గ్రామస్థుల ఆగ్రహం
ఈ విషయం బయటికి తెలియగానే తోడలబాగి గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ మహిళ పడుతున్న వేదన చూసి గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అనుమానం ఒక మనిషిని ఇంతటి ఉన్మాదిగా మారుస్తుందా? అని అంతా మండిపడ్డారు. జుట్టు పోవడమే కాకుండా తన భర్తే తనను అలా అవమానించడంతో లక్ష్మీబాయి తీవ్రమైన మానసిక ఆందోళనలోకి వెళ్లిపోయింది. ఆమె పరిస్థితి చూసి మహిళా సంఘాలు కూడా రోడ్డుపైకి వచ్చి ఆ కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
పోలీసుల ఎంట్రీ.. కటకటాల్లోకి ఉమేష్!
ఈ దారుణం గురించి సమాచారం అందగానే సవలగి పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. గ్రామానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. వెంటనే ఉమేష్‌ను అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. భార్యను హింసించడం, ప్రాణహాని తలపెట్టడం లాంటి సీరియస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఉమేష్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..మద్యపానం, అనుమానం అనేవి కాపురాల్లో చిచ్చు పెట్టడమే కాదు, ఇలా జైలు పాలయ్యేలా కూడా చేస్తాయి.












Click it and Unblock the Notifications