పహల్గాం మారణకాండ తర్వాత గాల్లోకి కాల్పులు.. అలా ఎందుకు చేశారంటే?
Pahalgam Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండ దేశాన్నే కాకుండా ప్రపంచాన్న దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కీలక కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ దారుణ ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 26 మంది పౌరులను అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత, ఉగ్రవాదులు సంబరాలు చేసుకుంటూ గాలిలోకి కాల్పులు జరిపినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసినట్లుగా పేర్కొన్నాడు.
భద్రతా సంస్థల వర్గాల ప్రకారం, పహల్గామ్ ప్రాంతంలో దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు, మారణకాండ తర్వాత వెంటనే సంబరాలు చేసుకుంటూ గాలిలోకి కాల్పులు జరిపారు. ఇది వారి హింసాత్మక చర్యను బహిరంగంగా ప్రదర్శించడాన్ని సూచిస్తుందని అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఒక కీలకమైన ప్రత్యక్ష సాక్షి ఎన్ఐఏకు కీలకమైన సమాచారాన్ని అందించారు. ఘటనల క్రమాన్ని పూర్తి చేయడంలో సహాయపడే సమాచారాన్ని వెల్లడించారు.

ఈ ప్రత్యక్ష సాక్షి తన వాంగ్మూలంలో ఉగ్రవాదులు 26 మంది పౌరులను కాల్చి చంపిన తర్వాత వెళ్లిపోయేటప్పుడు తనను అడ్డగించారని వెల్లడించారు. తనను కల్మా పఠించమని అడిగారని.. తాను స్థానిక యాసలో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత వదిలివేశాసినట్లు అతను చెప్పుకొచ్చాడు. అనంతరం సంతోషంతో గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారని తన వాంగ్మూలంలో తెలిపాడు. ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు బృందం ఘటనా స్థలం నుంచి ముష్కరులు ఉపయోగించిన 4 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకుంది.
ఎన్ఐఏ గత నెలలో ఇద్దరు స్థానికులు పర్వేజ్ అహ్మద్ జోథర్, బహీర్ అహ్మద్‌ను ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినందుకు అరెస్ట్ చేసింది. వారు విచారణలో ముగ్గురు సాయుధ ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారు. వారు లష్కర్-ఏ-తొయిబాతో అనుబంధం ఉన్న పాకిస్థాన్ పౌరులుగా గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతుండగా.. దాడి జరిగిన కొద్ది నిమిషాల్లో ఏమి జరిగిందో కీలక వివరాలను వెల్లడించి ప్రత్యక్ష సాక్షిని ఎన్ఐఏ కనుగొంది. ఉగ్రవాదులకు సహకరించిన స్థానికులు పర్వేజ్, బషీర్.. ఒక కొండ దగ్గర నిలబడి ఉగ్రవాదుల వస్తువులను చూసుకుంటున్నారని, వాటిని ఉగ్రవాదులు చివరికి వారి నుంచి సేకరించారని కూడా ఆ వ్యక్తి దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడి చేశారు. మతం ఆధారంగా దాడి చేసి.. ముస్లింలు కానీ వారైన 26 మందిని హత్య చేశారు. అయితే ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముగ్గురు పాకిస్థానీలు హషీమ్ ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్, ఆసిఫ్ ఫౌజీ, అనంతనాగ్ నివాసి అయిన స్థానిక ఉగ్రవాది అబిద్ హుస్సేన్ థోకర్ సహా నలుగురు ఉగ్రవాదుల ప్రమేయం ఉందని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఇక పహల్గామ్ మారణకాండకు ప్రతీకారంగా మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతం కావడంతో పాటు ముష్కరుల స్థావరాలు ధ్వంసం అయ్యాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications