నేను ఓ లాయర్ గా ఆ కేసు తీర్పు పరిశీలిస్తా, తరువాత ఆలోచిస్తాం, సీఎం !

బెంగళూరు: దశాబ్దం క్రితం కర్ణాటకలోని ధర్మస్థలలో జరిగిన సౌజన్య అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. తాను ఓ సీఎంగా కాకుండా లాయర్‌గా ఆలోచించి నేను హైకోర్టును ఆశ్రయించాల్సి ఉందని, మొదట సీబీఐ కోర్టు తీర్పు కాపీని చదివి అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందో లేదో చూస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళూరు విమానాశ్రయంలో సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడారు.

ధర్మస్థలంలో సౌజన్య అత్యాచారం, హత్య కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించినట్లు సిద్దరామయ్య తెలిపారు. అయితే, సౌజన్య తల్లిదండ్రులు మళ్లీ దర్యాప్తు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని అభ్యర్థించారని, కాని చట్ట ప్రకారం ఏం చేయాలో చూసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని, మొదట తాను న్యాయవాదివిగా ఆలోచించి హైకోర్టును ఆశ్రయించాల్సి ఉందా, లేదా అని ఆలోచిస్తామని సిద్దరామయ్య అన్నారు.

 CBI

సౌజన్య కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు తీర్పు కాపీని నేను ఇప్పటి వరకు చూడలేదు. సౌజన్య తల్లిదండ్రులు కోర్టు ఆర్డర్ కాపీని తీసుకొచ్చారు. ఇప్పుడు నేను న్యాయవాదిగా జడ్జిమెంట్ కాపీని చదివిన తరువాత హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటే కచ్చితంగా హైకోర్టుకు వెలుతామని, సౌజన్య కేసును మళ్లీ విచారించడానికి చర్యలుతీసుకుంటామని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచనాప్రాయంగా వెల్లడించారు.

బెంగళూరులో సౌజన్య హత్య కేసుపై మీడియాతో మాట్లాడిన కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ సౌజన్య హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయించే విషయంలో ఇంత వరకు ఆలోచన చేయలేదని, ప్రస్తుతానికి మా దగ్గర అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి కూడా తనకు ఎలాంటి సూచనలు రాలేదని, దీని ద్వారా సౌజన్య హత్య కేసును మళ్లీ విచారించే ప్రసక్తే లేదని హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ పరోక్షంగా చెప్పారు.

సౌజన్య అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన సమాచారాన్ని నటుడు దునియా విజయ్ సోషల్ లో ఆయన మనసులోని మాటలను పంచుకున్నారు. హీరో దునియా విజయ్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇలా పోస్టు చేశారు. తాను ప్రతి సంవత్సరం ధర్మస్థలాన్ని సందర్శించడం ఆనవాయితీ, కానీ ఈ రోజు సౌజన్య కేసు తీరును చూస్తుంటే, సౌజన్యకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు మంజునాథ్ దర్శనం చేయకూడదని నేను భావిస్తున్నాను, నిజం సూర్యకాంతి లాంటిది.,ఎవరు ఎక్కువ కాలం సూర్యకాంతిని దాచలేరు అంటూ హీరో దునియా విజయ్ పోస్టు చేశారు.

 CBI

ధర్మస్థలలో సౌజన్యపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి 11 ఏళ్లు పూర్తి అయ్యింది. అయితే నిందితుల ఆచూకీ మాత్రం ఇంతవరకు లభించలేదు. అమాయక యువతి మరణానికి న్యాయం చేయాలని సౌజన్య కుటుంబాలు మరియు సంస్థలు పోరాడుతూనే ఉన్నాయి. తాజాగా సీబీఐ కోర్టు తీర్పు తర్వాత సౌజన్య కేసు మళ్లీ సంచలనం రేపుతోంది. ఈ పరిణామం నేపథ్యంలో సౌజన్య కేసుపై మళ్లీ విచారణ జరిపి దోషులను చట్టపరిధిలో శిక్షించాలని బెల్తంగడి ఎమ్మెల్యే హరీష్ పూంజా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+