శ్రద్ధ హత్య తరహాలో..: అత్తను చంపి 10 ముక్కలు చేశాడు, వేర్వేరు ప్రాంతాలో భాగాలు!

జైపూర్: దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్యను తలపించేలా మరో హత్య రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె మేనల్లుడు దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మార్బుల్ కట్టర్‌తో 10 ముక్కలు చేసి సమీపంలోని అడవిలో పలు ప్రాంతాల్లో వాటిని విసిరేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

అత్తను హత్య చేసి పది ముక్కలుగా నరికాడు

అత్తను హత్య చేసి పది ముక్కలుగా నరికాడు

పోలీసులు నిందితుడు అనుజ్ శర్మ అలియాస్ అచింత్య గోవిందదాస్‌ను అరెస్టు చేశారు. అడవి నుంచి మృతురాలి కొన్ని శరీర భాగాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మహిళ ఇతర శరీర భాగాల కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు. జైపూర్‌లోని విద్యాధర్‌నగర్ ప్రాంతంలోని లాల్‌పురియా అపార్ట్‌మెంట్ సెక్టార్-2లో ఈ ఘటన జరిగింది.

డిసెంబర్ 11న అనుజ్ తన అత్త సరోజ్ శర్మ (64)ని సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత తన బాత్‌రూమ్‌లోని మార్బుల్ కట్టర్ మెషీన్‌ను ఉపయోగించి మృతదేహాన్ని అడవిలో పారవేసే ముందు 10 ముక్కలుగా నరికాడు.

రక్తపు మరకలు కడుగుతూ దొరికేశాడు

రక్తపు మరకలు కడుగుతూ దొరికేశాడు

ఆ తర్వాత అతడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అనుమానం రాకుండా ఉండేందుకు తన అత్త మిస్సింగ్‌ రిపోర్టును సమర్పించడం గమనార్హం. అయితే, కిచెన్‌లోని రక్తపు మరకలను అనూజ్ కడుగుతుండగా పట్టుబడ్డాడు. ఆ తర్వాత మృతురాలి కుమార్తె పూజ, అనూజ్‌పై కేసు నమోదు చేసి, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఘటనపై డీసీపీ నార్త్ ప్యారిస్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. సరోజ భర్త మరణించిన తర్వాత ఆమె మేనల్లుడు అనుజ్ ఆమెను చూసుకునేవాడు. అనూజ్ ఖర్చులు మొత్తం ఆమే భరించేది. సరోజ్‌కి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు విదేశాల్లో ఉంటున్నారు.

అత్తను ముక్కలు చేసి ఢిల్లీ రోడ్డువైపు అడవిలో విసిరేశాడు

అత్తను ముక్కలు చేసి ఢిల్లీ రోడ్డువైపు అడవిలో విసిరేశాడు

తను ఏదైనా చేయాలనుకుంటే అత్త అడ్డుచెబుతుండటంతో ఆమెపై అనూజ్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అనూజ్ ఆమెను హత్య చేశాడు. కాగా, అనూజ్ తన బీక్ పూర్తి చేశాడు. డిసెంబరు 11న అతడు ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా అత్త నిరాకరించడంతో కోపోద్రిక్తుడై ఆమెను హత్య చేశాడని ఆరోపించారు. మృతదేహాన్ని పారవేయడానికి, అతను సికార్ రోడ్‌లో ఉన్న హార్డ్‌వేర్ దుకాణం నుంచి మార్బుల్ కట్టర్ మిషన్‌ను తీసుకువచ్చాడు.

అనంతరం మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో, బకెట్‌లో నింపి ఢిల్లీ రోడ్డు వైపు అడవిలోని వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ ఇతర శరీర భాగాల ఆచూకీ కోసం అడవిలో గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+