అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా తొలి మెసేజ్ ఇదే.. ఎమోషనల్ అయిన వ్యోమగామి
భారత అంతరిక్ష చరిత్రలో వ్యోమగామి శుభాంశు శుక్లా సరికొత్త రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) చేరిన తొలి భారతీయుడిగా నిలిచారు. యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన శుభాంశు శుక్లా ఇవాళ సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషల్ లో అడుగుపెట్టడంపై శుభాంశు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక మెసేజ్ ను భూమి మీదకు పంపించారు.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి భూమిని చూసే అవకాశం వచ్చిన కొద్దిమందిలో తాను ఒకడినని ఆనందం వ్యక్తం చేశారు. భారతీయుల ప్రేమ, ఆశీస్సుల వల్లే తాను ఇక్కడికి చేరుకోగలిగానని శుభాంశు శుక్లా తెలిపారు. గర్వంతో భారతీయ పతాకాన్ని భుజంపై ధరించానని తెలిపారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోని వ్యోమగాములు స్వాగతం పలుకుతుంటే ఇంట్లోకి వచ్చినట్లుగానే అనుభూతి పొందానని శుభాంశు శుక్లా ఎమోషనల్ అయ్యారు.
"భూమి మీద నుంచి ఇక్కడకు వచ్చిన 634 వ వ్యోమగామిని నేను. ఇక్కడకు రావడం గర్వంగా ఉంది. మీ ప్రేమ, ఆశీస్సులతోనే ఇది సాధ్యం అయింది. కాస్త ఇబ్బందిగా ఉంది. తల భారంగా ఉంది. రానున్న రోజుల్లో ఇవన్నీ అలవాటు అయిపోతాయి. నా జర్నీలో ఇదే ఫస్ట్ స్టెప్. రానున్న రోజుల్లో అంతరిక్షానికి సంబంధించిన కీలక పరిశోధనలు చేపడతాం" అని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తెలిపారు.

ఇక భారత అంతరిక్ష చరిత్రలో వ్యోమగామి శుభాంశు శుక్లా సరికొత్త రికార్డు సృష్టించారు. యాక్సియం-4 మిషన్ లో భాగంగా ఫాల్కన్-9 రాకెట్‌ద్వారా భారత్ కు చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టారు. ఆయనతోపాటు అమెరికాకు చెందిన పెగ్గీ వెట్ సన్ , పోలాండ్ కు చెందిన స్టావోస్ ఉజ్నాన్స్ కీ , హంగేరీకు చెందిన టిబర్ కఫూ లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్లారు.
బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి వీరి యాత్ర ప్రారంభం అయింది. గురువారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ మిషన్ లో భాగంగా వీరంతా 14 రోజులపాటు అక్కడే గడపనున్నారు.












Click it and Unblock the Notifications