బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

SI scam: తప్పించుకుని తిరిగేసి సెంచురీ చేసిన మేడమ్, సీఐడీకి చిక్కిన ఫస్ట్ ర్యాంక్ రచనా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బెళగావి: కర్ణాటకను కుదిపేసిన సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ) రాతపరీక్షల స్కామ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అరెస్టు అయ్యారు. ఎస్ఐ పరీక్షల స్కామ్ కేసులో విద్యాసంస్థల యజమానురాలు, బీజేపీ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసు అధికారులు, ఎస్ఐ పరీక్షల రాతపరీక్షలు రాసిన నిరుద్యోగులు అరెస్టు అయ్యారు. 100 రోజులకు పైగా సీఐడీ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఎస్ఐ పరీక్షల ఫస్ట్ ర్యాంక్ మేడమ్ చివరికి సీఐడీ అధికారులకు రెండు రాష్ట్రాల సరిహద్దులో చిక్కిపోవడంతో కథ మరో మలుపు తిరిగింది.

Illegal affair: భర్త ఫ్రెండ్ తో ఆంటీ రొమాన్స్, కూతురికి పెళ్లి చేసింది, భార్య రసపట్టులో ఉంటే భర్త ఎంట్రీతో !Illegal affair: భర్త ఫ్రెండ్ తో ఆంటీ రొమాన్స్, కూతురికి పెళ్లి చేసింది, భార్య రసపట్టులో ఉంటే భర్త ఎంట్రీతో !

 ఎస్ఐ పరీక్షల స్కామ్

ఎస్ఐ పరీక్షల స్కామ్

కర్ణాటకలో కొన్ని నెలల క్రితం మహిళా, పురుషుల విభాగాల్లో సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాల నియామకం కోసం రాతపరీక్షలు జరిగాయి. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని అన్ని జిల్లాలో జరిగిన ఎస్ఐ ఉద్యోగాల నియామకం పోటీ రాతపరీక్షలకు కొన్ని వేల మంది నిరుద్యోగులు హాజరైనారు.

 స్కామ్ బయటపడింది

స్కామ్ బయటపడింది

ఎస్ఐ ఉద్యోగాల రాతపరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పైగా ఒక్కొక్కరి నుంచి వసూలు చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. కర్ణాటకను కుదిపేసిన సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ) రాతపరీక్షల స్కామ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అరెస్టు అయ్యారు.

 పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు

పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు

ఎస్ఐ పరీక్షల స్కామ్ కేసులో విద్యాసంస్థల యజమానురాలు, బీజేపీ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసు అధికారులు, ఎస్ఐ పరీక్షల రాతపరీక్షలు రాసిన నిరుద్యోగులు అరెస్టు అయ్యారు. ఇప్పటికే కొందరు బెయిల్ మీద బయటకు రావడంతో కొందరికి బెయిల్ చిక్కక, జైలు నుంచి బయటకురాలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ఫస్ట్ ర్యాంక్ మేడమ్ అరెస్టు

ఫస్ట్ ర్యాంక్ మేడమ్ అరెస్టు

ఎస్ఐ ఉద్యోగాల నియామకం రాతప రీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ (మహిళలు) సంపాధించి రచనా హనుమంత (25) అనే యువతి ఈ స్కామ్ కేసు నమోదు అయినప్పటి నుంచి పోలీసులకు చిక్కలేదు. సుమారు మూడున్నర నెలల నుంచి పోలీసులు రచనా హనుమంత కోసం గాలిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని సెంచురీ పూర్తి చేసిన రచనా హనుమంత చివరికి కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దులోని కలబురి జిల్లాలోని చెక్ పోస్టు దగ్గర సీఐడీ పోలీసు అధికారులకు చిక్కిపోయింది.

 తప్పించుకుని తిరిగి సెంచురీ పూర్తి చేసింది

తప్పించుకుని తిరిగి సెంచురీ పూర్తి చేసింది

ఫస్ట్ ర్యాంక్ రచనాను కోర్టు ముందు హాజరుపరిచి విచారణ చేస్తున్నామని సీఐడీ అధికారులు అంటున్నారు. 100 రోజులకు పైగా సీఐడీ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఎస్ఐ పరీక్షల ఫస్ట్ ర్యాంక్ మేడమ్ చివరికి సీఐడీ అధికారులకు రెండు రాష్ట్రాల సరిహద్దులో చిక్కిపోవడంతో కథ మరో మలుపు తిరిగింది.

English summary
SI recruitment scam: Rachana Hanumantha arrested by CID police in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X