ఒకే విమానంలో సిద్దూ, డీకేశీ, అభిమానులు పోటాపోటీ స్వాగతాలు, కార్లు మాత్రం వేరు !
బెంగళూరు/న్యూఢిల్లీ:కర్ణాటకకు కాబోయే సీఎం సిద్దరామయ్య, కాబోయే ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ ఒకే విమానంలో బెంగళూరు చేరుకున్నారు. గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన సిద్దరామయ్య, డీకే శివకమార్ హెచ్ఏఎల్ విమానాశ్రయానికి గురువారం సాయంత్రం 6. 20 గంటలకు చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీ స్వాగతం పలికారు.
ఐదు రోజు నుంచి సీఎం సీటు కోసం పోట్లాడుకుంటున్న సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఒకే విమానంలో బెంగళూరు రావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంతోషించారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణాటక సాంప్రధాయం ప్రకారం భాజాభజంత్రీలతో, వివిద కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు.

సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు సీఎల్ పీ సమావేశానికి హాజరుకావడానికి కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే బెంగళూరు చేరుకున్నారు. సీఎల్ పీ సమావేశంలో ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడిన తరువాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటకకు కాబోయే సీఎం, ఉప ముఖ్యమంత్రి పేరు అధికారికంగా ప్రకటిస్తారు.
హెచ్ఏఎల్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో సిద్దరామయ్య, డీకే శివకుమార్ అభిమానులు భారీ సంఖ్యలో గుమికూడారు. పోటాపోటీగా సిద్దరామయ్య జిందాబాద్, డీకే జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఒకేసారి హెచ్ఏఎల్ విమానాశ్రం నుంచి కార్లలో బయలుదేరాడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మొదట విమానాశ్రయం నుంచి డీకే శివకుమార్ ఆయన కారులో బయటకు వచ్చారు. అభిమానులను చూసిన డీకే శివకుమార్ కారులో కుర్చుని అభిమానులకు చెయ్యి ఊపుతు బయలుదేరారు. డీకే శివకుమార్ కారు మీద అభిమానులు పూల వర్షం కురిపించారు. తరువాత విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన సిద్దరామయ్య కారు మీద పూలవర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమికూడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications