Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెంబు చేతికి ఇచ్చిన మోదీకి మీరు ఏం రిటన్ గిఫ్ట్ ఇస్తారు?, చేతిలో అదే పెట్టండి, సీఎం సీరియస్!

నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయ్యాక దేశ ప్రజల చేతికి ఖాళీ చెంబు ఇచ్చారని, కర్ణాటక మంత్రిగా, ఎంపీగా పని చేసిన బళ్లారి శ్రీరాములు బళ్లారి జిల్లా ప్రజలకు ఇంకా పెద్ద చెంబు ఇచ్చారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యంగ్యంగా అన్నారు. బళ్లారి-విజయనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బళ్లారి శ్రీరాములును చిత్తుచిత్తుగా ఓడించాలని సీఎం సిద్దరామయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదే నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇ.తుకారాంను గెలిపించాలని, మనం విజయోత్సవ సందేశం ఇచ్చేందుకు సిద్దంగా ఉండాలని సీఎం సిద్దరామయ్య బళ్లారి జిల్లా ప్రజలకు మనవి చేశారు. కూడ్లిగిలో నిర్వహించిన ప్రజాధ్వని-2 జనసమావేశం ప్రారంభోత్సవంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ నరేంద్ర మోదీ, బళ్లారి శ్రీరాములుు మీకు ఇచ్చిన చెంబును వాళ్లకు తిరిగి ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Siddaramaiah appealed to the people to defeat Modi and Bellary Sriramulu

ఇదే శ్రీ రాములుకు అన్ని పదవులను బళ్లారి ప్రజలు అందించారు, అయితే ప్రజలకు శ్రీరాములు ఏం చేశారు అని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలను పట్టించుకోకుండా వదలేసిన మోదీని మీరు ఎలా ఆదరిస్తారు అని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. ఓటమి ఖాయమనే భయంతోనే యాక్సిస్ ప్రచురించిన ష్యూర్ పోల్స్ ను మోదీ ఎందుకు తొలగిస్తున్నారని, మరిన్ని అబద్ధాలు సృష్టించి భారతీయుల మధ్య చిచ్చు పెడతారని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు.

ఇటీవల విడుదల అయిన కొన్ని సర్వేలతో మోదీకి భయం పట్టుకుందని, వారికి ఓటమి భయం ఉందని, బీజేపీ 200 సీట్లకు పైగా గెలవలేదని సర్వేలు చెబుతున్నాయని, తన ఓటమిని నిర్ధారించే సర్వేలను మోదీ బయటకురాకుండా చూస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దుయ్యబట్టారు. మోదీ నిత్యం పచ్చి అబద్ధాలు చెబుతుంటారు. ఇప్పుడు తన ఓటమి ఖాయమని సర్వేలు వస్తున్న తరుణంలో వీలైనప్పుడల్లా అసత్యాలు సృష్టించి అదే అపద్దాలను ప్రచారం చేస్తున్నారని సిద్దరామయ్య ఆరోపించారు.

మోదీ మాయమాటలకు భారతీయులు పదే పదే పడరని సిద్దరామయ్య అన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తి వెనుకబడిన ప్రజలను ఇరకాటంలో పడేసే మోదీ స్కెచ్ విఫలం అయ్యాయని, మోదీని పదవి నుంచి కిందకు దించే సత్తా మీ చేతుల్లోనే ఉందని సీఎం సిద్దరామయ్య ప్రజలకు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మహిళల ఖాతాల్లోకి ఏడాదికి లక్ష రూపాయలు వస్తాయని, నిరుద్యోగుల ఖాతాలో లక్ష రూపాయలు కూడా జమ చేస్తామని, దేశంలోని రైతులు అందరి రుణాలు మాఫీ చేస్తామని సీఎం సిద్దరామయ్య ప్రజలకు హామీ ఇచ్చారు. బళ్లారిలో శ్రీరాములును చిత్తుచిత్తుగా ఓడించాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+