నరేంద్ర మోడీ ఎఫెక్ట్: జయలలితను ఫాలో అవుతున్న సిద్ధు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఇప్పటికే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ తన తదుపరి లక్ష్యాన్ని కర్నాటకను పెట్టుకుంది. వచ్చే ఏడాది కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికలు జరిగితే తమకు ఎన్ని సీట్లు వస్తాయో తెలుసుకునేందుకు బీజేపీ అంతర్గత సర్వే చేసుకుంది. ఇందులో 150 సీట్ల వరకు తమకు వస్తాయని కమలనాథులు లెక్కలు వేసుకున్నారు.

సర్వే: దక్షిణాదిన బీజేపీ ప్రభుత్వం, కర్నాటకలో 150 సీట్లు

మరోవైపు, ఇప్పటికే యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాలతో బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ పార్టీ కర్నాటకను నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. జయలలితను ఫాలో కానున్నారు.

రూ.5, రూ.10కే టిఫిన్, భోజనాలు వడ్డించేలా 'నమ్మ' క్యాంటీన్లు నెలకొల్పందుకు శ్రీకారం చుట్టారు. ఒక్క బెంగళూరులోనే 198 'నమ్మ' క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. 2017-18 బడ్జెట్లో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు.

పది రూపాయలకు భోజనం

పది రూపాయలకు భోజనం

బెంగళూరు వ్యాప్తంగా 198 నమ్మ క్యాంటీన్లు నెలకొల్పుతామనీ, టిఫిన్ రూ.5, మధ్యాహ్నం భోజనం రూ.10కే అందిస్తామన్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు.

సవిరుచి సంచారి

సవిరుచి సంచారి

మిగతా జిల్లాల్లో కూడా 'సవిరుచి సంచారీ' పేరిట సంచార క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. ఈ పథకంలో స్వయం సహాయక సంఘాల ద్వారా సబ్సిడీ కింద ఆహారం అందిస్తామన్నారు.

అన్న భాగ్య పథకం

అన్న భాగ్య పథకం

అన్న భాగ్య పథకం కింద అందిస్తున్న కోటా బియ్యాన్ని 5 కిలోల నుంచి 7 కిలోలకు పెంచుతున్నామన్నారు. తమిళనాడులో జయలలిత 2011లో 'అమ్మ క్యాంటీన్లు' పేరిట తొలిసారి ఇలాంటి పథకాన్నిప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

తమిళనాట జయలలిత

తమిళనాట జయలలిత

తమిళనాడు వ్యాప్తంగా అమ్మ క్యాంటీన్లలో రూ.1కే ఇడ్లీలు, రూ.5 కేల పొంగళ్లు అందిస్తుండడంతో లక్షలాది మంది పేద ప్రజలకు ఆకలి తీర్చుకునే అవకాశం కలిగింది.

అమ్మ క్యాంటీన్లు

అమ్మ క్యాంటీన్లు

ప్లేటు సాంబారు అన్నం రూ.5, ప్లేటు పెరుగన్నం రూ.3 పథకాలు ప్రజాదరణ పొందాయి. సాయంత్రం రెండు చపాతీలు, పప్పు కలిపి రూ.3కే అందిస్తారు. జయలలిత ప్రారంభించిన ఈ పథకాలు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులను ఆకర్షించాయి. ఢిల్లీ, గుజరాత్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 'అమ్మ క్యాంటీన్ట మాదిరి ఆహార పథకాలను ప్రవేశపెట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Karnataka Chief Minister Siddaramaiah is following Jayalalithaa with Namma canteens.
Please Wait while comments are loading...