తమిళనాడు, కర్ణాటక పంచాయితీ ఢిల్లీకి షిఫ్ట్, ఎంపీలు హ్యాండ్ ఇస్తే కథ క్లైమాక్స్ !

బెంగళూరు/చెన్నై: కావేరీ నదీ జలాల పంపకం విషయంలో పెద్ద దుమారమే రేపేందుకు నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా తమిళనాడు-కర్ణాటక మధ్య ఈ అంశంపై పెద్ద వివాదం మొదలై ఇప్పటికే ఇరు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన ఎంపీలు పార్టీ విభేదాలు మరిచి ఏకమవుతారని, త్వరలో కర్ణాటక రైతుల కోసం అందరూ కలిసిపని చేస్తారని నమ్మకం ఉందని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ జోస్యం చెప్పారు.

కావేరీ నదీజలాల పంపకానికి సంబంధించి దేశ రాజధాని న్యూఢిల్లీలో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు సమావేశం ఏర్పాటు చేసినట్లు డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ బెంగళూరులోని సదాశివనగర్ నివాసం దగ్గర మీడియాతో మాట్లాడుతూ కావేరి జలాల కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు.

 Siddaramaiah government

కావేరీ నదీ జలాల పంపిణీపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అలాగే సీఎం సిద్ధరామయ్య, నేను, మంత్రులు చెలువరాయస్వామి, మహదేవప్ప, హెచ్‌కే పాటిల్‌, రాష్ట్ర ప్రజాప్రతినిధులు, ఎంపీలు అందరూ ఢిల్లీలో కేంద్రమంత్రిని కలుస్తున్నాం అన్ని అన్నారు. బుధవారం ఢిల్లీలో కర్ణాటకకు చెందిన ఎంపీలందరితో సమావేశం నిర్వహించి కర్ణాటక రైతుల సంక్షేమానికి అవసరమైన కృషి చేస్తామని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు.

దీని ద్వారా దేశ రాజధాని ఢిల్లీలోనూ కావేరీ చిచ్చు రగులుతుంది. కర్ణాటకలో కరువు పరిస్థితి తమిళనాడు ప్రభుత్వానికి అర్థం కావడం లేదని, ఇలా కావేరీ నదీ జలాల పంపిణీ అంశాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి చర్చలు జరపాలని అనుకుంటున్నామని డీకే శివకుమార్ అన్నారు. ఈ సమయంలో వర్షాలు కురవకపోవడంతో కర్ణాటక రైతులను గాలికి వదిలేసి తమిళనాడులోని కావేరీ ప్రాంత రైతులకు నీరందించాలని తమిళనాడు ప్రభుత్వం పట్టుబడుతోందని డీకే శివకుమార్ ఆరోపించారు.

 Siddaramaiah government

అయితే ఇది చూసి రాష్ట్ర ప్రజాప్రతినిధులు ఒక్కటయ్యారు. పార్టీలకతీతంగా అందరూ ఏకమై దేశ రాజధాని ఢిల్లీకి పయనం అయ్యారని, కాబట్టి కనీసం ఈసారి అయినా మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుందా? అని రైతులు ఎదురు చూస్తున్నారని డీకే శివకుమార్ చెప్పారు. సాధారణంగా కర్ణాటకలో ఈసారి రుతుపవనాలు దెబ్బ తియ్యడంతో తీవ్ర కరువుతో అన్నదాతలు అల్లాడిపోతున్నారని డీకే శివకుమార్ విచారం వ్యక్తం చేశారు.

 Siddaramaiah government

అందువల్ల కేంద్రంలోని పెద్దలు కర్ణాటక పరిస్థితిని అర్థం చేసుకుని నీటి పంపిణీ విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సలహా ఇవ్వాలని డీకే శివకుమార్ పట్టుబట్టారు. ఇదే కారణంతో కర్ణాటక ప్రభుత్వం కూడా కేంద్రాన్ని ఒప్పించేందుకు సిద్ధంగా ఉందని, రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో సమావేశం కానుందని డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. అయితే అన్ని పార్టీల ఎంపీలు సిద్దరామయ్య అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు అవుతారా ? లేదా ? అని వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+