నోటి దురద: హోం శాఖ నుంచి జార్జ్ ఔట్
బెంగళూరు: ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని ఇంత కాలం ఒంటికాలి మీద నిలబడిన కేపీసీసీ అధ్యక్షుడు, విధాన పరిషత్ సభ్యుడు (ఎంఎల్ సీ) డాక్టర్ జీ. పరమేశ్వర్ చివరికి హోం శాఖ మంత్రి పదవి తీసుకుని సంతృప్తి పడ్డారు.
గత శాసన సభ ఎన్నికల సందర్బంలో కూరటగెరె నియోజక వర్గం నుంచి పోటి చేసిన పరమేశ్వర్ ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు. అధిష్టానం పరమేశ్వర్ ను ఎంఎల్ సీని చేసింది. తరువాత తనకు డిప్యూటి సీఎం పదవి కావాలని అడుగుతున్నారు.
ఇటివల సీఎం సిద్దరామయ్య, పరమేశ్వర్ ఢిల్లీ చేరుకుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించారు. పరమేశ్వర్ ను హోం శాఖ మంత్రిగా నియమించాలని రాహుల్ గాంధీ సూచించారు. అధిష్టానం ఆదేశాల మేరకు పరమేశ్వర్ వెనక్కి తగ్గారు.

మూల్యం చెల్లించుకున్న జార్జ్!
ఐఏఎస్ అధికారి డికే రవి ఆత్మహత్య కేసుతో పాటు పలు కేసుల విషయాలలో జార్జ్ ఆరోపణలు ఎదుర్కున్నారు. అంతే కాకుండా బెంగళూరు నగరంలో బీపీవో ఉద్యోగిని గ్యాంగ్ రేప్ కేసు విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఒకరు ఇద్దరూ కలిసి అత్యాచారం చేస్తే అది రేప్, ముగ్గురు నలుగురు కలిసి అత్యాచారం చేస్తే అది గ్యాంగ్ రేప్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్బంలో ప్రతి పక్షాలు ఆయనను హోం శాఖ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చివరికి ఇప్పుడు ఆయన హోం శాఖ నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది.












Click it and Unblock the Notifications