వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

SIFF Young Artiste Festival:గ్రాండ్ ఫినాలే 2020-21ను ఎక్కడ ఎప్పుడు వీక్షించాలి..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: SIFF యంగ్ ఆర్టిస్ట్ 2020 అనేది జాతీయ స్థాయిలో చిన్నపిల్లల కోసం పెట్టిన టాలెంట్ కాంపిటీషన్.మ్యూజిక్ మరియు డ్యాన్స్‌లోని 20 విభాగాల్లో విద్యార్థులు అవార్డులు, సర్టిఫికేట్లు, రూ.25 లక్షలు విలువ చేసే స్కాలర్షిప్‌లను గెలుచుకునే అవకాశం ఉంది. జాతీయ వేదికలపై తమ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు విద్యార్థులకు ఇదొక సదవకాశం. అంతేకాదు దేశవ్యాప్తంగా పేరుగాంచిన మ్యూజిక్ మాస్ట్రోలు వీరికి మెంటార్లుగా వ్యవహరిస్తారు.

ఇప్పటి వరకు దేశ నలుమూలల నుంచి 12000 ఎంట్రీలు వచ్చాయి. ఇందులో 20 విభాగాల్లో టాప్ 100లో నిలిచిన వారిని గుర్తించడం జరిగింది. వీరంతా ఆయా విభాగాల్లో ఫైనల్స్‌లో పోటీపడతారు. ఇక 4 సెప్టెంబర్ 2021 శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగే యంగ్ ఆర్టిస్ట్ ఫెస్టివల్-గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటిస్తారు.

SIFF Young Artiste Festival: When & Where to watch ‘the Greatest Grand Finale 2020-21’

సిఫ్ యంగ్ ఆర్టిస్ట్ ఫెస్టివల్ గ్రాండ్ ఫినాలే 2021లో మ్యూజిక్ మరియు డాన్స్‌లు ఉంటాయి. పలు విభాగాల్లో విజేతలను గుర్తించడం జరుగుతుంది. అంతేకాదు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్. సుబ్రమణ్యమ్, నికితా గాంధీ, టెరెన్స్ లూయిస్, షాల్మాలి ఖోల్గడే, ఎహెసాన్ నూరాణీ, శోవనా నారాయణ్, బ్లాక్ ఐస్ క్రూ బ్యాండ్‌లు ప్రదర్శన ఇస్తాయి. ఇక ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రముఖ యాంకర్ ఆదిత్యనారాయణ్ వ్యవహరిస్తారు.

ఈ మొత్తం ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలంటే 2021 4 సెప్టెంబర్ సాయంత్రం 4 గంటలకు ఈ లింక్‌పై క్లిక్ చేసి వీక్షించండి: https://finale.youngartiste.com/

అంతేకాదు విజేతను ప్రకటించే ఆ క్షణాలు ఆ అనుభూతులను ప్రతక్ష్యంగా చూడండి. ఇందుకోసం ఇప్పుడే రిజిస్టర్ చేసుకుండి.
http://shorturl.at/mopvC

అంతేకాదు మీ క్యాలెండర్ పై నోటిఫికేషన్ రిమైండర్ పెట్టుకోవడం మర్చిపోకండి.

సిఫ్ (SIFF) యంగ్ ఆర్టిస్ట్ గురించి:

SIFF
సింఘాల్ అయ్యర్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనేది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోన్న ఒక దాతృత్వ సంస్థ. మరింత నాణ్యమైన విద్యను అందించడం, భారతీయ సంగీతం, కలలను ప్రమోట్ చేసే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది.

SIFF యంగ్ ఆర్టిస్ట్ కోర్సులు:

చిన్న పిల్లలకు కౌమార దశలో ఉన్నవారికి మ్యూజిక్ డ్యాన్స్‌లలో ఆన్‌లైన్ కోర్సులు అందిస్తోంది యంగ్ ఆర్టిస్ట్. బిగినర్స్, ఇంటర్మీడియెట్ మరియు అడ్వాన్స్‌డ్‌ లెవెల్స్ వారికి ఈ కోర్సులను డిజైన్ చేయడం జరిగింది. లైవ్ క్లాసులు, గైడెడ్ ప్రాక్టీస్ సెషన్స్, క్రియేటివ్ అసైన్‌మెంట్స్, బృందాలుగా ఏర్పడి నేర్చుకోవడం, పెర్ఫార్మెన్స్ మరియు మాస్టర్ క్లాసెస్ సర్టిఫికేషన్‌‌లు ఇవ్వడం జరుగుతుంది.

యంగ్ ఆర్టిస్ట్ 2020-21 కాంపిటీషన్:

తొలి దశలో యంగ్ ఆర్టిస్ట్‌ 12వేల రిజిస్ట్రేషన్లు 11 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలనుంచి స్వీకరించింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు పట్టణాల నుంచి ఈ ఎంట్రీలు వచ్చాయి. రెండవ దశలో యంగ్ ఆర్టిస్ట్ అడ్వాన్స్‌డ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా టాప్ 100 మంది ఫైనలిస్టులను మ్యూజిక్ డ్యాన్స్‌లలో పేరుగాంచిన మెంటార్ల కింద తీర్చిదిద్దడం జరుగుతుంది. డాక్టర్ ఎల్. సుబ్రమణియమ్, కవితా కృష్ణమూర్తి, మాధవి ముద్గల్‌తో మరికొందరు మెంటార్లుగా వ్యవహరిస్తారు. కేటగిరీల్లో ప్రత్యేక సెషన్లను పలువురు ప్రముఖులు ప్రారంభించారు. రుక్మిణి విజయకుమార్ (భరతనాట్యం), అనుపమ భగవత్ (సితార్/సరోద్), నిఖిత గాంధీ (ఇండియన్ & వెస్ట్రన్ వోకల్), సాగర్ బోరా (హిప్‌హాప్) లాంటి వారు ఉన్నారు.

యంగ్ ఆర్టిస్ట్ ఫెస్టివల్ - గ్రాండ్ ఫినాలే 2021 సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని finale.youngartiste.com పై వీక్షించొచ్చు.

English summary
SIFF Young Artiste 2020 is a national level talent competition for school children across India. Students will win awards, certificates and scholarships worth Rs. 25 Lakhs across 20 categories in music and dance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X