భారత్-పాక్ అణుయుద్ధమే వస్తే ? ఎవరి బలం ఎంత !
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నపాకిస్థాన్ కు బుద్ధి చెప్పడానికి భారత్ మెరుపుదాడులకు దిగింది. ఇప్పుడు ప్రపంచంలోని అందరి చర్చ ఒక అంశం మీదకు మళ్లింది. ఒకవేళ భారత్-పాక్ దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం వస్తే ఏం జరుగుతుంది ? అని చర్చించుకుంటున్నారు.
యుద్ధం జరిగితే ఇరు దేశాల మీదే కాకుండా ప్రపంచంపైఎలాంటి ప్రభావం పడుతుంది ? వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయి ? ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది ? తదితర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భారత్-పాక్ దేశాల దగ్గర అణ్వాస్త్రాలు ఉండటంతో ప్రపంచం యావత్తూ దీనిపై దృష్టి పెట్టింది. శుత్రుదేశం అయిన పాక్ మీద భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అని చర్చిస్తున్నారు. 2015లో అణు శాస్త్రవేత్తలు విడుదల చేసిన బులిటెన్ ల ప్రకారం భారత్-పాక్ దేశాల దగ్గర అణ్వాయుధ సంపత్తి ఇలా ఉంది.

భారత్ అణ్వాయుధ సంపత్తి
విమానం రకం వాటిలొ వార్ హెడ్లు వజ్ర- 32, శంషేర్-16, మొత్తం 48 ఉన్నాయి. భూమ్మీద నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు, వాటిలో వార్ హెడ్లు ఇలా ఉన్నాయి. పృధ్వీ 2- 24, అగ్ని1-20, అగ్ని2-8, అగ్ని 3-4, మొత్తం 56 ఉన్నాయి. సముద్రం మీద నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు ధనుష్-2, కె 15-12, మొత్తం 14 ఉన్నాయి.

పాక్ దగ్గర అణ్వాయుధ సంపత్తి
విమాన రకం వాటిలో వార్ హెడ్లు ఎఫ్ 16 ఎ/బి-24, మిరాజ్ 3/4-12, మొత్తం 36 ఉన్నాయి. భూమ్మీద నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు, వాటిలో వార్ హెడ్లు ఇలా ఉన్నాయి. ఘజనీ (హతాఫ్-3)-16, షహీన్ 1 (హతాఫ్ 4)-16, షహీన్ 2(హతాఫ్ 6)-8, ఘోరీ (హతాఫ్ 5)-40, నాసర్ (హతాఫ్ 9)- 6, మొత్తం 86 ఉన్నాయి. క్రూయిజ్ క్షిపణలు బాబర్ (హతాఫ్ 7)-8 ఉన్నాయి.

మనకు ఎక్కువే ఉంది
భారత్ దగ్గర సుమారు 600 కిలోల ఫ్లుటోనియం నిల్వ ఉంది. పాక్ దగ్గర 170 కిలోలు ఉంది. అత్యంత శుద్ధి చేసిన యురేనియం (హెచ్ఇయు) సుమారు 3.1 టన్నుల మేర పాక్ దగ్గర ఉందని అంచనా. ఒక్కో వార్ హెడ్ కు ఐదు కిలోల ఫ్లుటోనియం, లేదా 15 కిలోల హెచ్ఇయు అవసరం అవుతుందని అంచనా. భారత్ 120, పాక్ 240 అణ్వాయుధాలను రూపొందించుకోగలవని అంచనా.

అణుయుద్ధంతో నష్టం ఎంత ఉంటుందంటే !
భారత్-పాక్ మధ్య ఒకవేళ అణుయుద్ధం సంభవిస్తే నష్టం ఎలా ఉంటుందనే దానిపై భిన్నమైన అంచనాలు ఉన్నాయి. రెండు దేశాలు కలిసి 100 అణు వార్ హెడ్లు ప్రయోగించినా 2.10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని సమాచారం.

ఓజోన్ పొరలో దాదాపు
అణు యుద్ధం జరిగితే ప్రపంచానికి రక్షణగా ఉన్న ఓజోన్ పొర దాదాపు సగానికి పైగా దెబ్బతింటుంది. ప్రపంచ వ్యాప్తంగా రుతుపవనాలు ప్రభావితమై వ్యవసాయ రంగంపై ప్రభావం చూపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది ఆకలితో అలమటిస్తారని 2013లో అంచనాలు వేశారు.

దేవుడే కాపాడాలి
భారత్ లోని నాలుగు మెట్రో నగరాలతో పాటు జైపూర్, లూథియానా, పుణె, భోపాల్, కోల్ కతా, లఖ్ నవూ, నాగ్ పూర్, అహమ్మదాబాద్ నగరాలపై పాక్ దాడులు చేసే అవకాశం ఉంది. పాక్ వద్ద ఉన్న వార్ హెడ్లలో 66% వరకు బాలిస్టిక్ క్షిపణులపై నుంచి ప్రయోగించేవే. ఇలాంటి క్షిపణులు పాక్ దగ్గర 86 ఉన్నాయి. నిజానికి భారత్ ను టార్గెట్ చేసుకునే హతాఫ్ శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల్ని పాక్ తయారు చేస్తుంది.

ఎవరెవరు
పాక్ వద్ద ఫ్లుటోనియం విడుదల చేసే రియాకర్లు నాలుగు ఉన్నాయి. భారత్ దగ్గర ఒకటే ఉంది. ఏటా పాక్ 20 అణ్వాయుధాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే భారత్ దగ్గర అయిదింటిని ఉత్పత్తి చేసే సామర్థం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications