అసహనంపై అద్నాన్, తెలుగులోనూ పాటలు పాడారు
ఢిల్లీ: భారత్‌లో అసహనం ఏమాత్రం లేదని, అసహనం ఉండి ఉంటే తాను ఈ దేశ పౌరసత్వాన్ని తీసుకొని ఉండేవాడిని కాదని ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ చెప్పారు. రెండు రోజుల క్రితం అద్నాన్ సమీకి భారత ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది.
భారత్‌లో తాను ఎప్పుడూ అసహనాన్ని ఎదుర్కోలేదని చెప్పారు. తనకు పౌరసత్వాన్ని మంజూరు చేసినందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు రుణపడి ఉంటానని ట్విట్టర్‌లో పేర్కొన్నరు. అతను జై హింద్ అని కూడా ట్వీట్ చేశారు. భారత్ పౌరుడిని అవుతున్నందుకు గర్విస్తున్నట్లు చెప్పారు.
కాగా, తన గాత్రంతో లక్షలాది ప్రేక్షకులను అలరించిన అద్నాన్ సమీ పాకిస్తాన్ పౌరసత్వాన్ని వదులుకొని భారతీయ పౌరసత్వాన్ని అందుకునున్నారు. గతంలో ఈయన తెలుగులో పాడిన 'ఏ జిల్లా ఏ జిల్లా' పాట సంగీత ప్రియులను అలరించింది.

వర్షం, మహానంది, యోగి, ఆడువారి మాటలకు అర్దాలే వేరులే, శంకర్ దాదా జిందాబాద్, 100%లవ్, ఊసరవెల్లి, ఇష్క్, జులాయి, గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, టెంపర్ తదితర చిత్రాలలో ఆయన పాటలు పాడారు.
హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ లాంటి ఎన్నో భారతీయ భాషల్లో పాటలు పాడిన అద్నాన్ సమీ జనవరి 1, 2016 నుండి భారత పౌరుడిగా మారారు. పాకిస్తాన్‌కు చెందిన అద్నాన్ సమీ 2001 నుండి భారత్‌లోనే నివాసం ఉంటున్నారు. ఇతను 1975 ఆగస్టు 15న జన్మించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications