SIR లో ఓట్లు ఎలా తీసేశారంటే ? ఫారం 7 అస్త్రం..! మరో బిగ్ బాంబ్..!
దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)లో ఓట్లను భారీ ఎత్తున తొలగిస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ తొలగించిన ఓట్ల సంఖ్య 13 కోట్లకు పైమాటే అని నివేదికలు చెప్తున్నాయి. ఈ ఓట్ల తొలగింపుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కోర్టులు సైతం జోక్యానికి నిరాకరిస్తున్న సందర్భాలు బెంగాల్ వంటి రాష్ట్రాల్లో చూశాం. ఈ నేపథ్యంలో తాజాగా బయటపడ్డ ఈసీ విభేదాల తర్వాత ఎస్ఐఆర్ విషయంలో జరిగిన అక్రమాలను ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఇదే క్రమంలో అక్రమ ఓట్ల తొలగింపులు ఎలా జరిగాయన్నది తాజాగా వెల్లడించింది.
ఫామ్ 7తో ఓట్ల తొలగింపులు ( SIR)
మాజీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి, మాజీ కేంద్రమంత్రి కూడా అయిన ఆర్కే సింగ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ బయటపెట్టిన విషయాల్ని ఎక్స్ లో ట్వీట్ చేశారు. SIR ప్రక్రియలో నిజమైన ఓటర్ల పేర్లను తొలగించడానికి జరుగుతున్న కుట్రలకు సంబంధించిన మరో విషయాన్ని 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' వెల్లడించిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఒక రాజకీయ పార్టీ (సాక్ష్యాధారాలు బీజేపీ వైపు సూచిస్తున్నాయి) నియోజకవర్గాల్లో కొంతమంది వ్యక్తులను నియమించిందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన లేదా భవిష్యత్తులో వేయగల ఓటర్ల నమోదుపై అభ్యంతరాలు దాఖలు చేయడమే వారి పని అని ఈ పరిశోధనలో తేలిందన్నారు. ఒక వ్యక్తి రోజుకు 100 నుండి 200 వరకు 'ఫారం-7' దరఖాస్తులను దాఖలు చేస్తూ, వివిధ అవాస్తవ కారణాలతో (ప్రధానంగా వారు దరఖాస్తులో పేర్కొన్న చిరునామాలో నివసించడం లేదని లేదా వారు చనిపోయారని చెబుతూ) ఓటర్ల నమోదును వ్యతిరేకిస్తుంటారని తెలిపారు.

The Indian Express has come out with another revelation of the machinations for deletion of names of genuine voters during the current SIR exercise.
— R. K. Singh (@RajKSinghIndia) September 30, 2026
The Indian Express investigation reveals that persons have been set up by a political party – evidence points to the BJP – in…
ఓటరుకు తెలియకుండానే..
ప్రతి ఫారం-7పై అభ్యంతరం తెలిపే వ్యక్తి సంతకం చేయాలి; కాబట్టి, అతను తన సొంత పేరుతో లేదా వివిధ కల్పిత పేర్లతో ఆ 100 ఫారమ్లపై సంతకం చేస్తాడన్నారు. వాస్తవానికి ఆ ఆరోపణలు అబద్ధమైనప్పటికీ, తాను చెబుతున్నది నిజమేనని అతను ధృవీకరణ పత్రం ఇస్తాడన్నారు. వాస్తవానికి అభ్యంతరం తెలిపే వ్యక్తి ప్రతి దరఖాస్తును స్వయంగా సమర్పించాల్సి ఉన్నప్పటికీ, అతను ఆ అభ్యంతరాలను గంపగుత్తగా ఎన్నికల నమోదు అధికారికి (ERO) పంపుతాడన్నారు. తన పేరు నమోదుపై అభ్యంతరం వ్యక్తమైందన్న విషయం సంబంధిత ఓటరుకు తెలియదన్నారు. ఈఆర్వో అతనికి నోటీసు జారీ చేసినప్పటికీ, దాన్ని ఓటరుకు చేరవేసేందుకు తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అది అతనికి అందదని తెలిపారు. ఓటరు హాజరు కాకపోవడంతో, అతని పేరు ఓటర్ల జాబితా నుండి తొలగిస్తారన్నారు.

ప్రజాస్వామ్యం బతకాలంటే..!
కాబట్టి ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని కోరుకునే సామాజిక కార్యకర్తలు రెండు పనులు చేయాలని ఆయన సూచించారు. 1. ఏం జరుగుతుందో ఓటర్లకు తెలియజేయాలని, ప్రతి సామాజిక కార్యకర్త, ప్రతి రాజకీయ పార్టీ ఈ పని చేయాలని కోరారు. అభ్యంతరాలు దాఖలైన సందర్భాల్లో ఈఆర్వోలు నోటీసులను జారీ చేసి, సంబంధిత వ్యక్తులకు అందజేశారో లేదో వారు తప్పక తనిఖీ చేయాలన్నారు. 2. అభ్యంతరం తెలిపే వ్యక్తులు దాఖలు చేసిన ఫారం-7లోని అనేక ధృవీకరణలు అవాస్తవమని తేలుతుందన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31, బీఎన్ఎస్ లోని సెక్షన్లు 171, 227, 228, 229, 233, 234, 236 , 237 ప్రకారం ఇది నేరమన్నారు. ఎన్నికల నమోదు అధికారి విచారణ లేకుండా ఒక పేరును తొలగించినా, లేదా ధృవీకరణ లేకుండా తప్పుడు ప్రకటనను అంగీకరించినా, అతను ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 32, బీఎన్ఎస్ లోని సెక్షన్లు 49, 233, 237 కింద విచారణకు బాధ్యుడవుతాడన్నారు. దీనివల్ల ప్రభావితమైన ఓటర్లు, అభ్యంతరం తెలిపిన వారిపైనా, ఈఆర్ఓలపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఈ విషయంలో సామాజిక, రాజకీయ కార్యకర్తలు వారికి సహాయపడాలన్నారు. ఓటర్లు క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రారంభించిన తర్వాత ఈ ఓటు దొంగతనం ఆగిపోతుందని ఆర్కే సింగ్ తెలిపారు.














Click it and Unblock the Notifications
