Constable: లేడీ పోలీసు మిస్సింగ్, లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి డెత్ నోట్ లో ?, పోలీసు !
బెంగళూరు/తుమకూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం క్రితం భర్త చనిపోయాడు. భార్య లేడీ పోలీసుగా ఉద్యోగం చేస్తున్నది. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లడం, ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్లి పిల్లలను చూసుకోవడం చేస్తోంది. ఉద్యోగానికి వెళ్లిన లేడీ పోలీసు తరువాత కనపడకుండా పోయింది. లేడీ పోలీసు కనపడటం లేదని పోలీసులు కేసు నమోదు చేసి గాలించారు. లాడ్జ్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జ్ లో దొరికిన డెత్ నోట్ అధారంగా రంగంలోకి దిగిన పోలీసులకు లేడీ కానిస్టేబుల్ శవం చిక్కడం కలకలం రేపింది.

లేడీ పోలీసు
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో సుధా (39) అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న సుధా ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. సుధా దంపతులకు 14 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమార్తె ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం సుధా భర్త చనిపోయాడు. తుమకూరు జిల్లాలోని హుళియూరు పోలీస్ స్టేషన్ లో సుధా లేడీ పోలీసుగా ఉద్యోగం చేస్తున్నది.

మాయం అయిన లేడీ పోలీసు
సుధా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో ఉద్యోగానికి వెళ్లడం, ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్లి పిల్లలను చూసుకోవడం చేస్తోంది. నాలుగు రోజుల క్రితం ఎప్పటిలాగే సుధా ఇంటి నుంచి బయలుదేరి ఉద్యోగానికి వెళ్లింది. తరువాత లేడీ పోలీసు సుధా కనపడకుండా పోయింది. లేడీ పోలీసు సుధా కనపడటం లేదని ఆమె తల్లి దాక్షాయణి ఫిర్యాదు చెయ్యడంతో తుమకూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి గాలించారు.

లాడ్జ్ లో ఆత్మహత్య.... డెత్ నోట్ లో
శివమొగ్గలోని లాడ్జ్ లో మంజునాథ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆత్మహత్య చేసుకునే ముందు మంజునాథ్ రాసి డెత్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోకి వివరాలు తెలుసుకుని షాక్ అయ్యారు. కనపడకుండా పోయిన లేడీ కానీస్టేబుల్ సుధా వివరాలు ఆ డెత్ నోట్ లో ఉండటంతో పోలీసులు బిత్తరపోయారు.

శవమై కనిపించిన లేడీ పోలీసు
తుమకూరు జిల్లాలోని అరసికెరె సమీపంలోని గ్రామం శివార్లలోని హైవే రహదారి పక్కన పలానా చోట సుధా శవం ఉంది వెళ్లి తెచ్చుకోండి అంటూ మంజునాథ్ డెత్ నోట్ లో రాసిపెట్టాడు. మంజునాథ్, సుధా వరుసకు అక్కాతమ్ముడు అవుతారు. సుధా, మంజునాథ్ ల మ్యద ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, ఇదే విషయంలో గొడవలు జరిగాయని, సుధాను కారులో పిలుచుకుని వెళ్లి ఆమెను చంపేసిన మంజునాథ్ తరువాత శివమొగ్గ వెళ్లి లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications