Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంట్లో కోపంతో ఫ్రీ బస్సు ఎక్కి అక్కాచెల్లెలు ఎక్కడికి వెళ్లిపోయారంటే ? !

బెంగళూరు/ధర్మస్థలం: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఐదు హామీల్లో ఒక్కటైన శక్తి పథకం కింద కర్ణాటకలో పుట్టిపెరిగి ఆ రాఫ్ట్రంలో నివాసం ఉంటున్న మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైన ఉచితంగా సంచరించడానికి సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మహిళలు ప్రభుత్వ ఆర్ టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ మహిళలు పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ శక్తి పథకం వల్ల చాలా మంది మహిళలకు మేలు జరిగితే కొందరికి బాధను తెచ్చిపెట్టింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల భార్య ఇంట్లో ఉండడం లేదని, వంట చేయడం లేదని, ఇప్పటికీ మాకు బస్సులో సీటు దొరకడం లేదని శక్తి పథకంపై యోజన చాలా మంది పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 RTC

మరోవైపు కూతుళ్లు కనిపించకుండా పోయారని తల్లిదండ్రులు బెంగళూరులోని కోణేణకుంటే పోలీస్ స్టేషన్‌లో కన్నీరుమున్నీరు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు సర్వీస్ కల్పించడం వలనే మా కూతుర్లు మాయం అయ్యారని ఆ తల్లిదండ్రులు ఆరోపించారు. చాక్లెట్లు కొనుక్కోవాలని ఇద్దరూ అక్కాచెల్లెళ్లు వాళ్ల తండ్రి డబ్బులు అడిగాడు,

ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని, మీరు డబ్బు అనసరంగా ఖర్చు చేస్తున్నారని తండ్రి కోపం చేసుకన్నాడు. అంతే 9వ తరగతి, 10వ తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారని ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు అమ్మాయిలు కనిపించడం లేదని బెంగళూరులోని కోణేణకుంటే పోలీస్ స్టేషన్‌లో వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులు చాక్లెట్లు కొనివ్వలేదనే కోపంతో ఇద్దరు అమ్మాయి బెంగళూరులోని కేఎస్ఆర్ టీసీ బస్సు ఎక్కి పవిత్ర పుణ్యక్షేత్రం అయిన ధర్మస్థలానికి వెళ్లారు. చాక్లెట్లకు తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ఇద్దరు కూతుళ్లు బెంగళూరులో బస్సు ఎక్కి ధర్మస్థలానికి ఉచితంగా ప్రయాణం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించడంతో అక్కాచెల్లెలు హ్యాపీగా రెండు రోజుల నుంచి ధర్మస్థలంలో ఉండిపోయారు.

 RTC

ఈ విషయం తెలియని తల్లిదండ్రులు నివ్వెరపోయి కోణేణకుంటే పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు అమ్మాయిల కోసం వెతికారు. అమ్మాయిల ఫోటోలు కర్ణాటకలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అమ్మాయిలు కనిపించకుండా పోయిన రెండు రోజుల తర్వాత జూన్ 18వ తేదీన ఆదివారం రాత్రి ధర్మస్థలంలో స్థానిక పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరు అమ్మాయిలు కనపడటంతో వాళ్ల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం ఉదయం తల్లిదండ్రులకు ఇద్దరు అమ్మాయిలను అప్పగించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+