అఘాయిత్యం: తండ్రిని చంపి వీడియో తీసిన అక్కాచెలెళ్లు
మీరట్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి కూతుళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. వావివరసలు మరిచి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న తండ్రిని మట్టుపెట్టారు. ఆ మానవమృగం నుంచి తమను తాను కాపాడుకోవడానికి అతన్ని చంపి, నేరాన్ని అంగీకరిస్తూ వీడియో రికార్డు చేశారు.
మీరట్‌లోని లాలాలజపతి రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీకి దగ్గర్లోని రాజ్‌నగర్ ప్రాంతంలో నివసించే కరణ్‌సింగ్(45) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కరణ్‌సింగ్ రోజూ మద్యం తాగి ఇంట్లో గొడవ చేసేవాడు. భార్యను కూడా చిత్రహింసలు పెట్టేవాడు.
అతను ఎప్పటిలాగే శుక్రవారం తెల్లవారు జామున బాగా తాగి ఇంటికి వచ్చాడు. వయసొచ్చిన తన ఇద్దరు కూతుళ్లతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. తండ్రి నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఆ యువతులు తమ తండ్రి తలను గోడకేసి బలంగా కొట్టారు. అనంతరం సుత్తితో అతడిని చావబాదారు. ఇదంతా వీడియోలో రికార్డు చేశారు.

ముఖాలకు స్కార్ఫ్ కట్టుకుని తమ తండ్రిని చంపిన ఘటనను, ఎందుకు చంపాల్సి వచ్చిందో చెబుతూ ఆ యువతులు వీడియోలో చిత్రీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువతులను అదుపులోకి తీసుకుని విచారించగా తామే తమ తండ్రిని చంపినట్లు అంగీకరించారు.
ఈ అమ్మాయిలు వీడియోలో ఏం చెప్పారో తమకు తెలియదని తమకు అందిన సమాచారం ప్రకారం వీరిపై ఐపీసీ 3014 ఏ ప్రకారం కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నామని ఎస్పీ ఓంప్రకాష్ చెప్పారు.ఘటన జరిగిన రోజే కరణ్ సింగ్ భార్య తమ ఐదేళ్ల కొడుకుని తీసుకుని ఇల్లు విడిచి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు.












Click it and Unblock the Notifications