విరమణ, ఉల్లంఘన - సరిహద్దుల్లో అర్ద్రరాత్రి తరువాత...!!
అపరేషన్ సింధూర్. ఉగ్రశిబిరాలను నేట మట్టం తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకు న్నాయి. పాక్ తో పాటుగా పీఓకేలోని ఉగ్ర స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ తరువాత పాక్ సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు తెగ బడింది. భారత్ సైన్యం వాటిని తిప్పి కొట్టింది. పాక్ లోని ఢిఫెన్స్ కేంద్రాల పైన భారత్ ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా జోక్యంతో కాల్పుల ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే, సరిహద్దుల్లో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి.
ఉల్లంఘన - కాల్పులు
ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిహద్దుల్లో కాల్పుల మోత కొనసాగింది. యుద్దం దిశగా పరిణామాలు కనిపించాయి. అయితే, అమెరికా జోక్యం తరువాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఆ తరువాత కొద్ద గంటల్లోనే పాక్ నుంచి తిరిగి కాల్పులు కొనసాగాయి. వీటి పైన భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. ఆ తరువాత సరిహద్దుల్లో క్రమేణా మార్పు కనిపించింది. ప్రస్తుతం ప్రశాంతత కొనసాగుతోంది. రాత్రి డ్రోన్లు, పేలుళ్లు, సైరన్ల మోతతో దద్దరిల్లిన జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బ్లాక్ అవుట్ ఎత్తివేశారు. జమ్మూ నగరంలోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్థరాత్రి తర్వాత పాక్ నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు నమోదు కాలేదు.

సాధారణ పరిస్థితులు
అఖ్నూర్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్థరాత్రి తర్వాత డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. జనజీవనం రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమైంది. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి కూడా ప్రస్తుతం ఎలాంటి కాల్పులు జరగడంలేదు. భద్రతా బలగాలు మాత్రం పూర్తిస్థాయి అప్రమత్తతో ఉన్నాయి. సున్నిత ప్రాంతాల్లో పహారాను పటిష్టం చేశాయి. అనుమానం వచ్చిన వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్, అమృత్‌సర్‌లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్థరాత్రి తర్వాత నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. కాల్పుల విరమణకు అంగీరించిన పాక్ గంటల్లోనే డ్రోన్లు పంపడం వల్ల రాత్రి అమృత్‌సర్‌లో బ్లాక్‌అవుట్ అమలు చేశారు. ఆ బ్లాక్ అవుట్‌ను ఉదయం ఎత్తివేశారు.
కాల్పులకు విరామం
ప్రస్తుతం అమృత్‌సర్‌లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. భద్రతబలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. అనుమానం ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పాక్‌తో విస్తృత సరిహద్దు ఉన్న రాజస్థాన్ జిల్లాల్లోనూ ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. జైసల్మేర్ నగరంలో ఎలాంటి కాల్పులు, సైరన్ల మోతలు వినిపిం చడంలేదు. కాల్పుల విరమణ అమలు అవుతున్నా.. భారత్ మాత్రం సంసిద్దంగా ఉంది. పాక్ నుంచి మరోసారి ఉల్లంఘన జరిగితే మాత్రం తీవ్ర స్థాయిలో ప్రతిఘటన తప్పదని భారత్ హెచ్చరిస్తోంది.












Click it and Unblock the Notifications