Air India: ఎయిర్ ఇండియా వరుస షాక్ లు..! ఇవాళ మరో ఆరు విమానాలు..!

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం జరిగి 270 మందికి పైగా చనిపోయిన ఘటన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదం ఎయిర్ ఇండియాకు తెచ్చిన కష్టం అంతా ఇంతా కాదు. ఈ ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాల్లో సాంకేతిక తనిఖీలు మొదలయ్యాయి. ప్రతీ విషయాన్నీ ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం ప్రారంభించారు. ఇదే ఇప్పుడు ప్రయాణికులకు సమస్యగా మారుతోంది.

అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిరిండియా డ్రీమ్ లైనర్ విమానాల ఆలస్యం, రద్దు కావడం ఎక్కువైంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాల్సిన విమానాల ప్రయాణాల్లో ఇబ్బందులు పెరిగాయి. తాజాగా ఓ అంతర్జాతీయ సర్వీస్ అత్యవసరంగా హాంకాంగ్ లో ల్యాండ్ అయింది. దీంతో ఎయిర్ ఇండియా మరింత అప్రమత్తమై విమానాలు బయలుదేరకముందే పలుమార్లు తనిఖీలు చేస్తోంది. దీంతో మరిన్ని విమానాలు ఆలస్యం కావడం, రద్దు కావడం జరుగుతోంది.

air india Dreamliner flight cancellations continue latest are delhi-paris and ahmedabad-london

ఇవాళ సాంకేతిక తనిఖీల కారణంగా ఢిల్లీ-పారిస్, అహ్మదాబాద్-లండన్, ఢిల్లీ-దుబాయ్, ఢిల్లీ-వియన్నా, లండన్-అమృత్ సర్ ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానాలు రద్దు కాగా.. ఢిల్లీకి రావాల్సిన మరో ఎయిర్ ఇండియా విమానం హాంకాంగ్ కు మళ్లించారు.
ఇవాళ జరిగిన తనిఖీల్లో సమస్యలు బయటపడటంతో వీటిని రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వీటిలో ప్రయాణించాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

అలాగే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. వీరికి కోరుకుంటే మరో సర్వీస్ అందించడం కానీ చార్జీలు వెనక్కి ఇవ్వడం కానీ చేస్తామని తెలిపింది. ఈ రెండు విమానాల రద్దుకు కొన్ని గంటల ముందు ఎయిర్‌లైన్ తన అహ్మదాబాద్-లండన్ గాట్విక్ సర్వీస్ ను రద్దు చేసినట్లు ప్రకటించింది. గగనతల పరిమితులు, అదనపు ముందు జాగ్రత్త తనిఖీల కారణంగా విమానం అందుబాటులో లేదని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+