భూమికి సమీపంగా ఆస్టరాయిడ్స్.. 6 అని తెలిపిన నాసా.. ఏం ముప్పు లేదు

గ్రహాలు, ఉపగ్రహాలతో పోల్చితే గ్రహశకలాలు చిన్నవే అయినా ఇవి అమితవేగంతో దూసుకెళుతుంటాయి. 6 ఆస్టరాయిడ్లు భూమికి సమీపం నుంచి వెళుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ ఆరింటిలో ఒక ఆస్టరాయిడ్ గంటకు 44,388 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేర్కొంది.

 Six asteroids to zoom past Earth today, fastest one to fly at a speed of 44,388 kmph

2021 వీఎక్స్7, 2021 డబ్ల్యూఈ1, 2021 డబ్ల్యూఎమ్2, 2021 ఎక్స్ టి1, 2021 డబ్ల్యూఎల్2, 2021 ఎక్స్ఈ అనే ఈ ఆరు గ్రహశకలాల గమనాన్ని నాసా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ గ్రహశకలాలు సూర్యుడి దిశగా వెళ్లే క్రమంలో భూగోళానికి దగ్గరగా వస్తున్నట్టు గుర్తించారు. వీటి వల్ల మానవాళికి ఏదైనా ప్రమాదం ఉందా అన్న విషయంపై నాసా ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. దాంతో వీటివల్ల భూమికి వచ్చే ముప్పేమీ లేదని స్పష్టమైంది. ఈ ఆరు గ్రహశకాల్లో 2021 డబ్ల్యూఎమ్2 అనేది అత్యంత వేగగామి అని నాసా చెబుతోంది. ఇది భూమికి 31,50,531 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది.

Recommended Video

    Longest Lunar Eclipse Of 21st Century ఈ శతాబ్దంలోనే సుధీర్ఘ చంద్రగ్రహణం || Oneindia Telugu

    డిసెంబరు 11న ఓ భారీ గ్రహశకలం భూమికి చేరువలోకి రానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి 4660 నెరియస్ అని నామకరణం చేశారు. దీన్ని 1982లో తొలిసారిగా పాలోమార్ అబ్జర్వేటరీ నుంచి గుర్తించారు. ఇది 330 మీటర్ల నిడివితో ఉంటుంది. భూమికి 39,34,424 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లనుంది. పలు దేశాలు నెరియస్ గురించి పరిశోధనలు చేపట్టాలని భావించినా అవి ప్రణాళికల దశలోనే ఆగిపోయాయి. ఇది భూమిని తాకితే అపారమైన ముప్పు తప్పదని నాసా తదితర అంతరిక్ష పరిశోధన సంస్థలు అప్పట్లో అంచనా వేశాయి. నెరియస్ తిరిగి 2031 మార్చి 2న భూమికి సమీపానికి వస్తుందని నాసా పేర్కొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+