Cylider Blast: హర్యానాలో ఘోరం.. సిలిండర్ పేలి ఆరుగురు మృతి..
హర్యానాలో ఘోరం జరిగింది. పానిపట్ జిల్లాలో గురువారం ఉదయం సిలిండర్ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఉదయం వంట చేస్తుండగా సిలిండర్ లీక్ అయ్యి పేలినట్లు తెలుస్తోంది. గది తలుపులు తెరుచుకోకపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. పానిపట్‌లో సిలిండర్ పేలి ఆరుగురు మృతి చెందడం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. మృతుడు పానిపట్ తహసీల్ క్యాంపు ప్రాంతంలో అద్దెకు ఉంటున్నట్లు తెలిసింది.
మృతులను అబ్దుల్ కరీమ్(50), అఫ్రోజా(46), ఇష్రత్ ఖటుమ్(17), రేష్మా(16), అబ్దుల్ షకూర్(10), అఫాన్(7)గా పోలీసులు గుర్తించారు. కాగా, వీరంతా బంగాల్‌కు చెందిన ఉత్తర దినాజ్‌పుర్ వాసులని పోలీసులు తెలిపారు. అయితే ఉదయం వంట వండుతున్నప్పుటు గ్యాస్ లీకై ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు.

సిలిండర్‌కు ఎలా మంటలు అంటుకున్నది ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. అంతకు ముందు ఆదివారం మధ్యప్రదేశ్‌లోని సత్నాలో సిలిండర్ పేలుడు జరిగింది. ఆదివారం ఉదయం ఓ రెస్టారెంట్‌లో ఉంచిన గ్యాస్ సిలిండర్‌లో మంటలు చెలరేగడంతో భారీ పేలుడు సంభవించింది.












Click it and Unblock the Notifications