ఉద్యోగం పేరుతో.. బలవంతంగా తాగించి, ఆరుగురు రేప్

ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం జరిగింది. 19 ఏళ్ల నేపాల్ యువతి పైన ఆరుగురు వ్యక్తులు ఆత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు చెందిన ఓ యువతిని ఆరుగురు ఢిల్లీలోని మెహరౌలీ ప్రాంతంలో అత్యాచారం చేశారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిందితుల్లో ఒకతను బాధిత యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తీసుకు వెళ్లాడు. అక్కడకు చేరుకోగానే మరో ఐదుగురు యువకులు ఉన్నారు. వారందరు కూడా తాగిన మత్తులో ఉన్నారు. తాగి ఉన్న వారు ఆమెను వేధించారు. అంతేకాదు, మందు తాగమని బలవంతం చేశారు.

Six men gang-rape Nepali girl in Delhi

వైద్య పరీక్షల్లో.. యువతికి బలవంతంగా మద్యం తాగించినట్లు, సామూహిక అత్యాచారానికి గురైనట్లుగా తేలినట్లు తెలుస్తోంది. కాగా, 2013లో ఢిల్లీలో నేరాలు గత ఏడాది కంటే ఎక్కువైనట్లుగా రికార్డులు చెబుతున్నాయి. 2012లో 706 రేప్ కేసులు ఉంటే, 2013లో 1636 కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+