హర్ధిక్ పటేల్ ఎఫెక్ట్: ఆరుగురు పటీదార్లకు మంత్రివర్గంలో చోటు కల్పించిన విజయ్ రూపానీ
గాంధీనగర్: గుజరాత్ ఎన్నికల్లో పటీదార్ల ఉద్యమ ప్రభావం కన్పించింది. ప్రధాన రాజకీయ పార్టీలు పటీదార్లకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యతను ఇచ్చాయి. పటీదార్ల ఉద్యమ నేత హర్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. విజయ్ రూపానీ మరోసారి ముఖ్యమంత్రిగా మంగళవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. తన మంత్రివర్గంలో ఆరుగురు పటీదార్లకు రూపానీ చోటు కల్పించారు.
విజయ్‌రూపానీతో పాటు మరో 20 మంది మంత్రులు మంగళవారం నాడు ప్రమాణం చేశారు.వీరిలో 6 మంది పటేదార్లకు పదవులు కట్టబెట్టింది బీజేపీ. తాజా మంత్రివర్గంలో మంత్రి పదవులు దక్కించుకున్న పటేదార్లలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఉన్నారు. ఆయతో సహా కౌశిక్ పటేల్, సౌరభ్ పటేల్, ప్రభాత్ పటేల్, ఈశ్వర్ పటేల్, రచ్చండ భాయ్ పటేల్ ఉన్నారు. ఇదిలా ఉండగా బ్రాహ్మణ వర్గానికి చెందిన విభావరిబెన్ దేవ్ మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుత కేబినెట్‌లో పదవి దక్కించుకున్న ఏకైక మహిళ కూడా విభావరిబెన్ కావడం గమనార్హం.

ఇక విజయ్ రూపానీ కేబినెట్‌లో ఐదు మంది ఓబీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, క్షత్రియ వర్గాని తలా మూడు పదవులు దక్కాయి. మొత్తం 20 మంది మంత్రుల్లో.. 10 మంది కేబినెట్ హోదాలు దక్కగా.. మరో పదిమందికి సహాయ మంత్రి పదవులు దక్కాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications