Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు..

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్యం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆపరేషన్ చివరి దశలో ఉందని హతమైన ఉగ్రవాది ఎవరనేది నిర్ధారిస్తున్నామని పోలీసులు తెలిపారు. "గ్రామంలోని కొన్ని నివాస గృహాలలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాక్కున్న ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను షోపియాకు చెందిన సమీర్ అహ్మద్ షేక్, షోపియాకు చెందిన డానిష్ థోకర్, షోపియాకు చెందిన ఉబైద్ పాత్ర, షోపియాకు చెందిన హంజారా షా, కుల్గామ్‌కు చెందిన యాసిఫ్ భట్‌లుగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది" అని అధికారులు తెలిపారు.

మొత్తం మీద 18 గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్‌ కొనసాగింది. ఈ ఆపరేషన్‌లో నాలుగు ఎకె సిరీస్ రైఫిళ్లు, రెండు పిస్టల్స్, నాలుగు గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. "ఈ ప్రాంతంలో పనిచేసే అన్ని భద్రతా బలగాల సమన్వయంతో కూడిన కృషి తర్వాత ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఉగ్రవాదులు మైనారిటీలపై అనేక దాడులకు పాల్పడినందున ఇది పెద్ద విజయం" అని పేర్కొన్నారు.

Six terrorists were killed in an encounter in Jammu and Kashmirs Kulgam district

సరిహద్దు వెంబడి భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు రెండు క్రితం ధృవీకరించిన విషయం తెలిసిందే.కుల్గామ్‌లోని నేహమా ప్రాంతంలోని సామ్నో వద్ద రాత్రిపూట ప్రశాంతంగా ఉన్న తర్వాత శుక్రవారం తెల్లవారుజామున తుపాకీ కాల్పులు జరిగినట్లు అధికారులు వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు దాక్కున్న ఇంట్లో మంటలు చెలరేగడంతో ఉగ్రవాదులు బయటకు వచ్చేశారు.

సెప్టెంబరు 13న అనంత్‌నాగ్‌లోని గారోల్ అడవుల్లో జరిగిన ఆపరేషన్‌లో వారం రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో నలుగురు భద్రతా దళాల సిబ్బంది, ఇద్దరు టెర్రరిస్టులు హతటమయ్యారు. అంతకుముందు, నవంబర్ 15, బుధవారం ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు బిడ్‌ను అడ్డుకున్నట్లు సైన్యం తెలిపింది. 'ఆపరేషన్ కలి' పేరుతో జాయింట్ ఆపరేషన్‌లో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చొరబాటుదారులను మట్టుబెట్టారు. హతమైన ఇద్దరు చొరబాటుదారులలో బషీర్ అహ్మద్ మాలిక్ అని ఆర్మీ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+