ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా లగేజీ బ్యాగు.. ఓపెన్ చేసి చూస్తే..
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ లగేజీ బ్యాగు అనుమానాస్పద రీతిలో అక్కడి భద్రతా అధికారులకు తారస పడింది. అయితే అధికారులు ఆ బ్యాగును ఓపెన్ చేసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ బ్యాగులో మానవ అస్థిపంజరం కనిపించింది.
లగేజీ బ్యాగులో మనిషి అస్థిపంజరం వార్త విమానాశ్రయం మొత్తం వ్యాప్తి చెందడంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. వెంటనే దిల్లీ పోలీసులు, ఎయిర్ పోర్టు సెక్యూరిటీ ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అయితే ఈ లగేజీ బ్యాగు ఓ మెడికల్ స్టూడెంట్ ది అని తేలింది. ఆ అస్థిపంజరం ఓ ఎడ్యూకేషనల్ టూల్ అని మెడికల్ స్టూడెంట్స్ అనాటమీ క్లాసుల కోసం వినియోగించేదిగా తేల్చారు. దీంతో ఎయిర్ పోర్టులోని ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 లో భద్రతా సిబ్బంది జనరల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. అయితే చెకింగ్ లో భాగంగా ఓ అనుమానాస్పద వస్తువును స్కానర్లు గుర్తించాయి. అయితే ఎయిర్ పోర్టు సేఫ్టీ అధికారులు బ్యాగు ఓపెన్ చేసి చూడగా మానవుని అస్థిపంజరం లభ్యం అయింది. దీంతో ఇది స్మగ్లింగ్ కు సంబంధించిందా..? ఏదైనా హత్యకు సంబంధించిందా..? అని అధికారులతోపాటు విమానాశ్రయంలోని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో సెక్యూరిటీ టీమ్స్ .. ఆ స్థలాన్ని ఐసోలేట్ చేసి.. దిల్లీ పోలీసులకు సమాచారం అందించాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ అస్థిపంజరం మెడికల్ స్టూడెంట్స్ వినియోగించే ఓ డెమో మోడల్ అని నిర్థారణకు వచ్చారు. ఈ లగేజీ బ్యాగు ఓ మెడికల్ స్టూడెంట్ కు సంబంధించినదిగా గుర్తించారు. కుళ్లిన వాసన లేదని తేల్చారు. ఈ క్రమంలో ఎలాంటి అరెస్టులు, విమాన అంతరాయాలు లేకుండానే పోలీసులు ఈ కేసును తేల్చారు.












Click it and Unblock the Notifications