Sketch: ఎవరిని టార్గెట్ చేశారంటే ?, పోలీసు అధికారి ఫ్యామిలీని రివాల్వర్ తో బెదిరించి !
బెంగళూరు/ చిక్కబళ్లాపురం: సామాన్య ప్రజలను దోచుకున్నా కిక్కు ఉండదు అనుకున్న దొంగలు ఏకంగా పోలీసు అధికారి ఇంటిని టార్గెట్ చేశారు. పోలీసు అధికారి ఇంటిలోకి చొరబడిన నిందితులు ఆయన కుటుంబ సభ్యులను రివాల్వర్, కత్తితో బెదిరించి నానా హంగామా చేశారు. చివరికి పోలీసు అధికారి ఇంటిలో లక్షల రూపాయల విలువైన బంగారు నగలు లూటీ చేశారు.
కర్ణాటకలోని చిక్కబళ్లాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న నారాయణస్వామి అనే ఆయన నివాసం ఉంటున్నారు. ఏఎస్ఐ నారాయణస్వామి ఇంటిలోకి చొరబడిన దొంగలు లూటీ చెయ్యాలని ప్రయత్నించారు. ఏఎస్ఐ నారాయణస్వామి భార్య సుగుణ, కోడలు రేఖాను రివాల్వర్ తో బెదిరించారు.

Romance: భర్తతో కాపురం, రాత్రికి ఎంజాయ్ చేద్దాం రాఅని ప్రియుడు ఫోన్, నువ్వెంత నీ బతుకెంత ?, నన్నే !
రివాల్వర్ తో బెదిరించిన నిందితులు ఏఎస్ఐ నారాయణస్వామి ఇంటిలోని రూ. 17 లక్ష్లల రుపాయల విలువైన బంగారు నగలు, నగదు, లూటీ చేసి పరారైనారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన నిందితులను అరెస్టు చేశారు. ఏకంగా ఏఎస్ఐ ఇంటిలో చోరీ జరగడంతో చిక్కబళ్లాపురం వాసులు హడలిపోయారు. అయితే ఏఎస్ఐ అధికారి ఇల్లు లూటీ చేసిన నిందితులను పోలీసులు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో గాలించి అరెస్టు చేశారు. చోరీ చెయ్యడానికి వెళ్లిన ఇల్లు ఏఎస్ఐది అని తెలిసినా నిందితులు చోరీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications