పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్.. ఇప్పట్లో కోలుకోవడం కష్టమే..
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ పై ఆ సమయంలో భారత్ కఠిన ఆంక్షలు విధించింది. సింధూ నదీ జలాల పంపిణీ నిలిపివేత, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపివేత అలాగే భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలు ప్రయాణించడాన్ని కూడా నిలిపివేసింది. అయితే తాజాగా ఆ గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. భారత గగనతలంపై పాక్ విమానాలపై నిషేధాన్ని అక్టోబర్ 24 వరకూ పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ నుంచే ఏ విమానం కూడా భారత గగనతలం గుండా ప్రయాణించడానికి నిషేధం.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం భారత గగనతలంపై పౌర విమానాలు అలాగే మిలిటరీ విమానాలు కూడా ప్రయాణం చేయడం నిషేధం అని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు అక్టోబర్ 24 వరకూ అమల్లో ఉంటాయి. ఇప్పటికే ఈ డెడ్ లైన్ ను చాలాసార్లు పొడిగిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. పహల్గాం ఎటాక్ తర్వాత ఏప్రిల్ 30 నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు పాకిస్థాన్ కూడా భారత విమానయాన సంస్థలపై నిషేధం విధించింది. అయితే భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్థాన్ కు ఆర్థికంగా పెద్ద దెబ్బగా భావించవచ్చు.

ఇక జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లో ఏప్రిల్ 22 న టెర్రరిస్టులు జరిపిన దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. దాంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది.
ధ్వంసమైన ఉగ్రస్థావరాల్లో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్.. ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది.












Click it and Unblock the Notifications