ప్రభుత్వోద్యోగిపై చేసుకున్న మంత్రి: పదవి కోల్పోయారు
పనాజి: ప్రభుత్వ ఉద్యోగిపై చేసుకున్న కేసులో దోషి తేలిన గోవా మంత్రి ఫ్రాన్సిస్కో మిక్కీ పచెకో తన పదవిని కోల్పోయారు. సుప్రీం కోర్టు అతడ్ని దోషిగా తేల్చడం తన మంత్రి పదవికి మిక్కీ శుక్రవారం రాజీనామా చేశారు.
గోవా వికాస్ పార్టీ నేత, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో మిక్కీ 2006 జులై 15న విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కపిల్ నటేకర్‌ను దూషిస్తూ, చేయిచేసుకున్నారు. దీంతో నటేకర్ కోర్టును ఆశ్రయించాడు.

కాగా, విధుల్లో ఉన్న ఉద్యోగిపై చేసుకోవడం ముమ్మాటికీ నేరమని చెబుతూ న్యాయస్థానం రూ. 1500 జరిమానాతోపాటు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. దీంతో సదరు మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుదీర్ఘకాలం నడిచిన ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడం ఇష్టంలేక తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజకీయ కుట్ర వల్లే తను తన పదవిని కోల్పోవాల్సి వచ్చిందని మిక్కీ ఆరోపించారు.












Click it and Unblock the Notifications